కాకినాడ(Kakinada) జిల్లాకు చెందిన లంకే గౌరీ బ్రతుకు తెరువు కోసం ఒమన్ దేశానికి డొమెస్టిక్ వర్కర్ గా 6 నెలల క్రితం వెళ్ళింది. గత 2 నెలలుగా అనారోగ్యంతో మానసిక ఒత్తిడితో బాధపడుతూ, ఎవరిని సహాయం అడగాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్న సమయంలో వారం రోజుల క్రితం ఆమె కుటుంబ సభ్యులు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న శ్రీ నారా లోకేష్(Nara Lokesh) గారిని కలిసి పరిస్థితి విన్నవించుకుని తనను స్వదేశానికి రప్పించాలని సహాయం కోరారు. వారు వెంటనే తనను ఇండియాకు తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్నారై టీడీపీ సెల్(NRI TDP CELL) ను ఆదేశించారు. తక్షణం స్పందించిన ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ ఈ సమాచారాన్ని ఒమాన్ ఎన్నారై టీడీపీ సభ్యులైన నాగరాజు, R శ్రీనివాస రావు మరియు మల్లారపు జ్యోతి సహాయంతో, ఒమాన్ లో ఉన్న గౌరి ఏజెంట్ తో సంప్రదింపులు జరిపారు.

ఇది కూడా చదవండి: Oman Incident: ఓమాన్ నుంచి మృతదేహాన్ని తెప్పించాలని వినతి! త్వరగా ఇండియాకు..

గౌరీని ఒమాన్ తీసుకొచ్చిన స్పాన్సర్ కూడా సానుకూలంగా స్పందించి ఆమె ఇండియాకు తిరిగి పంపించేందుకు ఒప్పుకున్నారు. తదుపరి ఆమెను ఒక సురక్షితమైన ప్రదేశానికి తరలించి, శుక్రవారం అనగా ది. 20-06-2025 సాయంత్రానికి హైదరాబాద్ చేరే ఏర్పాటు చేశారు. కాగా, గౌరీని ఒమాన్ నుండి ఇండియాకు తీసుకువచ్చే విషయంలో సమన్వయం చేసిన కాకినాడకు చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు గారు లంకే గౌరికి ఒమాన్ నుండి హైదరాబాద్ కు విమాన ప్రయాణ టిక్కెట్ స్పాన్సర్ చేసి ఆమె భారత్ కు రావడంలో ఎంతో సహాయపడ్డారు. తక్షణం స్పందించి లంకే గౌరి కి సహాయం చేసిన ఎన్నారై టీడీపీ ఒమాన్ సభ్యులకు మంత్రి లోకేష్, ఎన్నారై టీడీపీ సెల్ ప్రెసిడెంట్ రవి వేమూరి, కోఆర్డినేటర్ రాజశేఖర్, అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా వెంటనే స్పందించి భారత్ కు తీసుకువచ్చినందుకు లంకే గౌరి ఎంతో సంతోషిస్తూ తనకు సహాయపడిన ప్రతిఒక్కరికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు వీడియో ద్వారా తెలిపింది. ఆ వీడియో ఆమె మాటల్లోనే...

ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

New Road Service: ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ! 4 వరుసలుగా .. మారనున్న ఆ ప్రాంతం రూపు రేఖలు!

Hyderabad Star Hotels: వచ్చే ఆరేళ్లలో 25 స్టార్ హోటళ్లు... ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్!

Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..

Air India Incident: టెన్షన్‌.. టెన్షన్‌.. మరో ఘోరం.. ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన పక్షి!

kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!

Cognizant: వైజాగ్‌కు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు!

World Bank Visits: పరుగులు పెడుతున్న అమరావతి రాజధాని పనులు.. వరల్డ్ బ్యాంక్, ADB బృందాలు!

Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..

MLA Seats నియోజకవర్గాల విభజన పై కసరత్తు! ఆ 50 సీట్ల లిస్టు! ఏ పార్టీకి అనుకూలం.?

kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!

AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group