AndhraPradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్‌(Railway line)కు సంబంధించి కీలకముందడుగు పడింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ(East Coast Railway Department) భువనేశ్వర్ కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం నుంచి ఖుర్ధారోడ్ వరకు మూడవ రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఫిబ్రవరిలోనే ప్రతిపాదనలు రాగా.. ఇప్పుడు రెండు డివిజన్ల పరిధిలోని కలెక్టరేట్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు, రైల్వే స్థలాల పరిశీలన వంటి పనుల కోసం రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పనులన్నీ సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త రైల్వే లైన్ ఏర్పాటుతో రైళ్ల రాకపోకలు సులువు అవుతాయని.. ప్రమాదాలు నివారించవచ్చు. ఒక లైన్‌లో సమస్య తలెత్తినా, మరో లైన్ ద్వారా రైళ్లను నడపవచ్చు అంటున్నారు.  మూడో లైన్‌కు సంబంధించి ప్రస్తుతం అధికారులు భూసేకరణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు భూముల వివరాలు సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!

రైల్వే, ప్రైవేటు ఆస్తులను గుర్తిస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు 45 కిలోమీటర్ల మేర రైల్వే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఆ భూములను రైల్వే ఉద్యోగులకు లీజుకు ఇచ్చారు. కానీ, అక్కడ వ్యవసాయం చేయడం లేదు.. భారీ గోతులు ఉన్నాయి. దీంతో రెవెన్యూ అధికారులకు భూసేకరణ సులువు అవుతోంది. మరికొన్ని చోట్ల ప్రైవేటు ఆస్తులు నష్టపోయే పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గం చూడాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే వారికి నష్టపరిహారం చెల్లించి భూముల్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ మూడో రైల్వే లైన్‌కు భూ సేకరణ అనుకున్న సమయానికి పూర్తయితే, మరో రెండేళ్లలో కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. మూడో రైల్వే లైన్‌కు సంబంధించి విశాఖపట్నం డివిజన్‌లో పనులు వేగంగా జరుగుతున్నాయి. రైలు పట్టాల పక్కన ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. మూడవ రైలు మార్గం పూర్తయితే ప్రమాదాలు నివారించవచ్చని.. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కార్గో రైళ్ల సంఖ్య ఎక్కువ కాబట్టి.. ఈ రైళ్లు ఆగకుండా నేరుగా గమ్యస్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది అంటున్నారు. సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా ఒకే మార్గం ద్వారా వెళ్లొచ్చంటున్నారు. రైళ్ల రాకపోకలు మూడవ లైన్ మరింత సులువుగా ఉంటుందటున్నారు. ప్రయాణికులకు, సరుకు రవాణాకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో అప్‌, డౌన్‌ లైన్లలో పట్టాలన్నీ ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా రోజంతా రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ పట్టాలను చేసిన తర్వాతే రైళ్లు నడిచాయి. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ మూడో లైన్ అందుబాటులోకి వస్తే ఈ సమస్యలు ఉండవు అంటున్నారు.

ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

AP Inner Ring Road: ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడే, మారనున్న రూపురేఖలు! వారి కళ్ళల్లో ఆనందం..

AP Weather report: అబ్బ.. చల్లని కబురు వచ్చేసింది.. 3 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో!

Jagan Tour: జగన్‌ పర్యటన.. సింగయ్య మృతి కేసులో కీలక మలుపు! ప్రమాద సమయంలో..

New Road Service: ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ! 4 వరుసలుగా .. మారనున్న ఆ ప్రాంతం రూపు రేఖలు!

Hyderabad Star Hotels: వచ్చే ఆరేళ్లలో 25 స్టార్ హోటళ్లు... ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్!

Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..

Air India Incident: టెన్షన్‌.. టెన్షన్‌.. మరో ఘోరం.. ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన పక్షి!

kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!

Cognizant: వైజాగ్‌కు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు!

World Bank Visits: పరుగులు పెడుతున్న అమరావతి రాజధాని పనులు.. వరల్డ్ బ్యాంక్, ADB బృందాలు!

Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..

MLA Seats నియోజకవర్గాల విభజన పై కసరత్తు! ఆ 50 సీట్ల లిస్టు! ఏ పార్టీకి అనుకూలం.?

kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!

AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group