రాజధానిలో పనులు తిరిగి ప్రారంభమైన వేళ ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధి బృందాలు అమరావతిలో పర్యటించాయి. సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ వారిని రాజధానిలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారు. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధుల్లో సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ స్పెషలిస్ట్ జోసెఫ్, పర్యావరణ సంరక్షణ కార్యకలాపాల సలహాదారు దమన్‌జిత్ సింగ్ మిన్హాస్ ఉన్నారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు, శాఖమూరు రిజర్వాయర్, ఎల్పీఎస్ జోన్ 2ఎ ప్రాజెక్టు సైట్, కార్మికుల క్యాంపులను ప్రపంచబ్యాంక్, ఏడీబీ బృంద సభ్యులు, సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ADCL) అధికారులు, సిబ్బంది పరిశీలించారు. ప్రపంచబ్యాంక్, ఏడీబీ బృంద సభ్యులు ఆయా సైట్లలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. గుత్తేదారు సంస్థలు క్యాంప్‌లలో అందుబాటులో ఉంచిన మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న గుత్తేదారులతో మాట్లాడారు. నిర్మాణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, సామాజిక రక్షణ, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు పాటించాల్సిన సురక్షిత విధానాలు, కార్మికుల భద్రత గురించి వివరించారు.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
MLA Seats నియోజకవర్గాల విభజన పై కసరత్తు! ఆ 50 సీట్ల లిస్టు! ఏ పార్టీకి అనుకూలం.?
kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!
AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!
YSRCP: జగన్ పర్యటనలో అరాచకం.. మాజీ మంత్రిపై కేసు.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా.!
Election Commission of India: ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!
YS Jagan: పల్నాడు జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డు వ్యవహారం..! వైసీపీ కార్యకర్త అరెస్టు!
Zero Commission: వారికి అదిరిపోయే న్యూస్! ఇక నుండి జీరో కమిషన్ .. మొత్తం డబ్బు మీకే!
Greenfield Highway: విజయవాడ నుండి నాగపూర్ వరకు కొత్త 4-లేన్ హైవే..! అక్కడ భూముల ధరలకు రెక్కలు!
Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!
ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..
Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: