నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాస కొత్తూరు కు చెందిన జుంబారత్ అన్వేష్ (27) ఓమాన్ దేశం లోని బురైమి లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన జరిగింది. ఓమాన్ నుంచి మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని మృతుని సోదరుడు హరీష్ శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్ లోని ప్రవాసీ ప్రజావాణి లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, రాష్ట్ర ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ మంద భీంరెడ్డి లతో కలిసి వినతిపత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ వి. శేషాద్రి తో మాట్లాడారు. మస్కట్ లోని ఇండియన్ ఎంబసీతో సంప్రదించి మృతదేహాన్ని తెప్పించాలని కోరారు.