శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం.ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) సహకారంతో యూరప్‌లోని వివిధ నగరాల్లో కలియుగ ప్రత్యక్ష దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా, మిల్టన్ కీన్స్‌లోని శ్రీ శ్రీనివాస (బాలాజీ) అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. TTD ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ మల్లికార్జున ప్రసాద్ గారి పర్యవేక్షణలో, పూజారి శ్రీ రంగనాథ గారి నేతృత్వంలో, తిరుమల నుండి వచ్చిన వేద పండితులు సంప్రదాయ మంత్రోచ్చారణలతో కల్యాణ మహోత్సవాలను నిర్వహించారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా మిల్టన్ కీన్స్‌లోని శ్రీ శ్రీనివాస (బాలాజీ) అసోసియేషన్ ఆఫ్ మిల్టన్ కీన్స్ ఆధ్వర్యంలో మిల్టన్ కీన్స్‌లోని కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1,800 మందికి పైగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
* తిరుమల నుండి వచ్చిన వేద పండితులు సంప్రదాయ మంత్రోచ్చారణలతో కల్యాణ మహోత్సవాలను నిర్వహించారు.
* భక్తులకు స్వామి వారి లడ్డూ ప్రసాదం, తీర్థం మరియు అక్షింతలను టీటీడీ వారు అందచేశారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కలిసి వచ్చిన అన్ని నిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు మరియు భక్తులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు అందరినీ నడిపిస్తూ, రక్షిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో శ్రీ లోకనాధ మారం, శ్రీ విక్రమ్ పరిటాల, శ్రీ రవికుమార్ నూనే, శ్రీ బాలాజీ వరదరాజన్, శ్రీ ప్రమోద్ పారేపల్లి, శ్రీ హర ప్రసాద్ గండ్లూరి, శ్రీ లక్ష్మీ నరసింహారావు యడవల్లి, శ్రీ గణేశన్ పిళ్లై, శ్రీ సాయి లింగినేని, శ్రీ యషాస్ అయ్యంగార్, శ్రీ జనార్ధన చింతపంటి, శ్రీ పద్మనాభన్ సారంగపాణి, శ్రీ పురుషోత్తమ యెనుముల, శ్రీ శివకుమార్ సిరిగిరి వంటి సభ్యులు ఒక టీమ్‌గా ఏర్పడి అద్భుతమైన సమన్వయంతో ఈ వేడుకను విజయవంతం చేశారు. ఇది తెలుగు ప్రవాసుల ఐక్యత, భక్తి, మరియు సాంస్కృతిక గొప్పతనానికి ప్రతిబింబంగా నిలిచింది.