రైల్వేల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ప్రశంసనీయం. ముఖ్యంగా, మోడీ ప్రభుత్వ హయాంలో వేగవంతమైన ప్రయాణానికి ప్రతీకగా నిలిచిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, తక్కువ సమయంలోనే ప్రయాణికులను గమ్యానికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రైళ్ల సేవలు, నిర్వహణలో మరింత సౌలభ్యం కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) కొన్ని కీలక మార్పులను ప్రకటించింది.
ఈ మేరకు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్‌ను సవరిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 16న, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారికి కొత్త అవకాశాలను కల్పిస్తుంది.షెడ్యూల్ మార్పులు మరియు సామర్థ్యం పెంపు ప్రయాణికుల రద్దీ మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్‌సిఆర్ ఈ మార్పులను తీసుకు వస్తున్నామని తెలిపారు. ఈ మార్పులు డిసెంబర్ 4, 2025 నుండి అమలులోకి వస్తాయి.
హైదరాబాద్–బెంగళూరు (కాచిగూడ–యశ్వంత్‌పూర్) మార్గంలో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇకపై శుక్రవారం మినహా అన్ని రోజులూ అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, ఈ మార్గంలోని రైలుకు కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేసామని తెలిపారు అదేవిధంగా ఈ సవరించిన షెడ్యూల్ డిసెంబర్ 4, 2025 నుండి అమలవుతున్నాయని తెలిపారు.
సికింద్రాబాద్–విశాఖపట్నం మార్గంలో, వందే భారత్ సేవలు సోమవారం మినహా ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త షెడ్యూల్ డిసెంబర్ 5, 2025 నుండి అమలులోకి వస్తుంది. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ సెప్టెంబర్ 12న విడుదల చేసిన ప్రకటనలో, ఈ మార్పులు రైలు కార్యకలాపాలను మరింత సున్నితంగా మార్చి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయని తెలిపారు.
వందే భారత్ రైళ్లకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ రైళ్ల ఆక్యుపెన్సీ రేటు 102.01% కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఇది 105.03%కి పెరిగింది. ఈ గణనీయమైన వృద్ధి, రైల్వేల అభివృద్ధిలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనం.