ఏపీలో రాజకీయంగా మరో కీలక ఘట్టానికి తెర లేవననుంది. రాష్ట్ర విభజన సమయం నుంచి పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల పెంపు దిశగా కసరత్తు మొదలైంది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు పెరగాల్సి ఉంది. జానాభా లెక్కల తరువాతనే ఈ నిర్ణయం అమలు చేస్తామంటూ.. ఇంకా అమలు చేయలేదు. ఇప్పుడు కేంద్రం జనగణనకు గజెట్ జారీ చేసింది. కుల గణన చేయనుంది. దీంతో.. ఏపీ, తెలంగాణలో లోక్ సభ.. అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. దేశంలో జనగణన పైన కేంద్రం గజెట్ జారీ చేసింది. జన గణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు.. అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రి య ఎన్నికల సంఘం చేపట్టనుంది.

ఇది కూడా చదవండి: AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!

ఇందులో భాగంగానే తెలుగు రాష్టాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది. కాగా.. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. దీంతో, ఇప్పుడు జనగణన పూర్తయిన తరువాత పెరిగే పార్లమెంట్ స్థానాల్లో మహిళకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏపీలో పెరిగే లోక్ సభ స్థానాల సంఖ్యలో మార్పుల పైన జనగణన తరువాతనే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న 25 లోక్ సభ స్థానాలను ఒక్కో జిల్లాగా మార్పు చేసారు. ఇదే కొనసాగితే.. ఇందులో దాదాపు ఆరు నుంచి ఎనిమిది వరకు ఎంపీ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!

ఇక, జనగణనతో పాటుగా కులగణన చేస్తుండటంతో... రిజర్వేషన్ శాతాల్లో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. ఎస్సీ - ఎస్టీ రిజర్వ్ స్థానాల సంఖ్య పెరగటం ఖాయమని భావిస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు కొన్ని జనరల్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక.. పార్లమెంట్ కేంద్రంగా అసెంబ్లీ స్థానాలు రెండు వరకు పెరిగేలా పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మూడు పార్టీల కూటమికి సీట్ల పెంపు కలిసొచ్చే అంశంగా అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కూటమి కలిసే ఉంటుందని.. సీట్లు గతంలో త్యాగం చేసిన వారికి ఈ సారి సీట్లు కేటాయింపుకు అవకాశం వస్తుందని చెబుతున్నారు. అదే విధంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు సైతం సామాజికంగా బీసీ, ఎస్సీ వర్గాల సంఖ్య పెరగటం ఖాయమని.. ఆ దామాషా ప్రకారం సీట్ల కేటాయించాల్సిన అంశం తమకు కలిసి వచ్చేదిగా చెబుతున్నారు. అయితే.. నియోజకవర్గాల పునర్విభజన లో సామాజిక సమీకరణాలు.. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు.. గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. 2009 లో చోటు చేసుకున్న పునర్విభజన ప్రక్రియ.. అదే ఏడాది జరిగిన ఎన్నికల గురించి ప్రస్తుతం పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. దీంతో.. రాజకీయం గా ఈ నియోజకవర్గాల పునర్విభజన.. సీట్ల పెంపు ఏపీ పార్టీల భవిష్యత్ కు కీలకం కానుంది. వేచి చూడాల్సిందే..!

ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

YSRCP: జగన్ పర్యటనలో అరాచకం.. మాజీ మంత్రిపై కేసు.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా.!

Visa New Rules: విద్యార్థి వీసాలకు కొత్త నిబంధనలు! సోషల్ మీడియా పోస్టులపై అమెరికా కళ్లు! అవి తప్పనిసరి..

Election Commission of India: ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

YS Jagan: పల్నాడు జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డు వ్యవహారం..! వైసీపీ కార్యకర్త అరెస్టు!

AP: ఏపీలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే...! వీటిలో సీట్ పొందాలంటే ఎంసెట్ లో ఎంత ర్యాంక్ రావాలి..?

Zero Commission: వారికి అదిరిపోయే న్యూస్! ఇక నుండి జీరో కమిషన్ .. మొత్తం డబ్బు మీకే!

Greenfield Highway: విజయవాడ నుండి నాగపూర్‌ వరకు కొత్త‌ 4-లేన్‌ హైవే..! అక్క‌డ భూముల ధరలకు రెక్క‌లు!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group