అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన గొడవల నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అడ్డుకుంటామని జేసీ ప్రభాకరరెడ్డి వర్గీయులు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ఆయనను తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు మూడుసార్లు ఇంతకు ముందు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఇటీవల హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సుమారు 300 మంది జేసీ ప్రభాకరరెడ్డి నివాసం వద్దకు చేరుకోగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమాచారం తెలియగానే పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
టీడీపీ నేతలతో పోలీసులు చర్చలు జరిపారు. చివరకు పెద్దారెడ్డి రావడం లేదని పోలీసులకు తెలియడంతో టీడీపీ శ్రేణులను జేసీ ఇంటి వద్ద నుంచి పంపించారు. అయితే ఈ రోజు ఉదయం నిజంగానే పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరడం హాట్ టాపిక్ అయింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ఇరువర్గాల ఘర్షణల వల్ల పట్టణంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: