ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ కేటగిరిలో పింఛన్ మంజూరు చేయనుంది. ఈ నెల 12న (గురువారం) కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లను అందజేయనుంది.. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వీటిని పంపిణీ చేయనున్నారు. దీనికోసం రూ.29.60 కోట్లు విడుదల చేశారు.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి డబ్బులు ఇస్తారు. భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందించే స్పౌజ్ కేటగిరి పింఛన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతేడాది నవంబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.. మే నెలకు సంబంధించిన రూ.4 వేల పింఛన్‌ను జూన్ 12న పంపిణీ చేస్తారు. ఎన్టీఆర్ పింఛన్ పథకం కింద సామాజిక భద్రతలో భాగంగా స్పౌజ్ పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే, అతని భార్యకు వెంటనే పింఛన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ స్పౌజ్ పింఛన్ విధానం గత ఏడాది నవంబర్ 1 నుంచి అమలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య స్పౌజ్ పింఛన్ కోసం దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 71,380 మంది అర్హులని గుర్తించారు. వీరందరికీ జూన్ 12న పింఛన్ పంపిణీ చేస్తారు. ఇవాళఈ పింఛన్ల మొత్తాలు గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో జమకానున్నాయి.
ఇది కూడా చదవండి: ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
గురువారం లబ్ధిదారులకు ఈ డబ్బుల్ని పంపిణీ చేస్తారు. 71,380 మందికి ఒక్కొక్కరికి రూ.4వేలు చొప్పున మంజూ చేయనుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ తీసుకుంటూ చనిపోయిన లబ్ధిదారుడి వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రం, జీవిత భాగస్వామి వివరాలను ఆన్‌లైన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అర్హులు స్పౌజ్ కేటగిరి దరఖాస్తు చేసుకోగా.. సచివాలయ సిబ్బంది పరిశీలించి అర్హుల్ని నిర్ధారించారు. అయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో సంక్షేమ సహాయకులు ఆన్‌లైన్‌లో ఆ వివరాలు నమోదు చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ పింఛన్ దరఖాస్తులు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌లోకి వెళ్లాక అనంతర అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి అర్హులుగా తేల్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్ కేటగిరిలో పలు దరఖాస్తుల్ని కూడా అధికారులు తిరస్కరించారు. 'ముందుగానే భార్య పింఛను పొందడం, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో ఇద్దరూ ఒకచోట లేకపోవడం, మరణ ధ్రువపత్రం అందించకపోవడం, భార్యాభర్తలిద్దరూ చనిపోవడం, అందుబాటులో లేకపోవడం, సాంకేతిక కారణాలు, ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండటం, భార్య మళ్లీ పెళ్లి చేసుకోవడం' వంటి కారణాలతో కొన్ని దరఖాస్తులు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు దరఖాస్తుల్ని ఎందుకు తిరస్కరించారో కూడా కారణాలను వెల్లడించారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: