తిరుపతిలో గంగమ్మ గుడి భజంత్రీలకు గ్రేడ్-2 నుండి గ్రేడ్-1 కళాకారులుగా పదోన్నతులు ఇస్తామంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ ఉత్తర్వులు జారీ చేసిన భారీ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐదుమంది భజంత్రీలు ఈ నకిలీ ఉత్తర్వులతో పదోన్నతులు పొందారు. వారిలో ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా రికార్డ్ అసిస్టెంట్‌గా పదోన్నతి ఇవ్వడం అనుమానాలను రేకెత్తించగా, కూటమి ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. విచారణలో ఈ పదోన్నతుల కోసం పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసినట్లు వెల్లడైంది.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
దేవాదాయ శాఖ అధికారులు ఈ నకిలీ ఉత్తర్వుల వ్యవహారాన్ని తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై కేసు నమోదు చేయగా, నకిలీ ఉత్తర్వుల ఆధారంగా పదోన్నతి పొందిన ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. అంతేకాకుండా, దేవాదాయ శాఖ వద్ద సంబంధిత ఫైల్స్ లేకపోవడంతో ఇది నకిలీ చర్యగా గుర్తించబడింది. ప్రస్తుతం నిందితుల్లో ప్రధానంగా ఉన్న గంగమ్మ గుడి కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...
కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!
ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!
చాంగి ఎయిర్పోర్ట్ లో కలకలం! ఇద్దరు భారతీయ మహిళలు అరెస్ట్!
ఏపీ రైతులకు బంపరాఫర్.. 80శాతం రాయితీ, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు!
విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! బస్ పాస్ లు ఉచితం! ఎవరెవరికంటే?
తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..
మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...
వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?
10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: