తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తున్నది. కొత్త మంత్రులకు ఏయే పోర్టు పోలియోలు ఇవ్వబోతున్నారు? ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు ఏమైనా ఉండబోతున్నాయా అనే చర్చ జోరుగా జరుగుతున్న వేళ సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించబోతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. దీంతో కొత్త మంత్రులకు కేటాయించబోయే శాఖలు ఏంటి అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామికి (Gaddam Vivek) న్యాయ, కార్మిక, క్రీడా శాఖలు, అడ్లూరి లక్ష్మణ్కుమార్కు (Adluri Laxman) ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి (Vakiti Srihari) పశుసంవర్ధక శాఖ, వాణిజ్య పన్నుల శాఖలు కేటాయించబోతున్నట్లు తెలుస్తున్నది.
ఇది కూడా చదవండి: ఏపీలో వచ్చే ఐదు రోజుల పాటు విస్తారమైన వర్షాలు... గుంటూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్!
ఈ మేరకు మరికాసేట్లో శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అధికారికంగా విడుదల చేయనుంది. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మూడు రోజులుగా అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. అయితే తాను పార్టీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చలు జరపలేదని, కేవలం కర్ణాటకలో కులగణన అంశంపై చర్చించినట్లు సీఎం స్పష్టం చేశారు. అయితే ఈ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకోగానే ఈ రాత్రికి కొత్త శాఖల కేటాయింపుపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ శాఖల కేటాయింపు జరిగితే కొత్త మంత్రులు రేపు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెక్రటేరియట్ చాంబర్లను సాధారణ పరిపాలన శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: