భారతదేశపు కుటుంబ కార్ల విభాగంలో ఓ అగ్రస్థానాన్ని నిరంతరం నిలబెట్టుకుంటూ వస్తున్న మారుతీ ఎర్టిగా (Maruti Ertiga), మరోసారి తన ఘనతను నిలబెట్టుకుంది. మే 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం, ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన 7 సీట్ల కారుగా తిరిగి నంబర్ వన్ స్థానాన్ని సంపాదించింది. ఇది ఈ MPV మోడల్‌కు మాత్రమే సాధ్యమైన విజయగాథ. వాస్తవానికి, ఎర్టిగా పేరు వినగానే మనసుకు దగ్గరైన కుటుంబ ప్రయాణాలు, విశాలమైన ఇంటీరియర్, ప్రయాణికుల సౌకర్యం గుర్తొస్తాయి. ఎన్నో మోడళ్ల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ఎర్టిగా తన వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, నెలనెలా అమ్మకాల జాబితాలో అగ్రస్థానాన్ని తాకడం విశేషం. చిన్న కుటుంబాల నుంచి పెద్ద కుటుంబాల వరకు అందరికీ సరిపోయేలా రూపొందించబడిన డిజైన్, మైలేజీతో, స్టైలిష్ లుక్‌తో పాటు లేటెస్ట్ ఫీచర్లు కూడా అందించడమే దీని బలాలు. రుతీ ఎర్టిగా స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రామాణిక భద్రతా లక్షణాలు వంటి అంశాలతో పాటు, సరిగ్గా భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన MPVగా నిలిచింది. అంతేకాకుండా, రోజురోజుకు పెరుగుతున్న క్యాబ్ డిమాండ్, షేరింగ్ బేస్డ్ ప్రయాణ సేవలకు అనుకూలంగా ఉండడం వల్ల కూడా ఎర్టిగా సేల్స్‌లో ఎప్పటికప్పుడు పుంజుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో మే నెలలో కూడా ఎర్టిగా తిరిగి నంబర్ వన్ స్థానం దక్కించుకోవడం విశేషం. భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో ఎర్టిగా ఆదరణ పొందే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
మారుతీ ఎర్టిగా మరోసారి తన మార్కెట్ ఆధిపత్యాన్ని చాటుకుంటూ, మే నెలలో మెరుగైన విక్రయాలతో ముందంజ వేసింది. మే 2025లో మాత్రమే ఈ MPV మోడల్ 16,140 యూనిట్లను విక్రయించి విశేష విజయాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో 13,893 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈ ఏడాది అది 16 శాతం వృద్ధిని సాధించింది. ఈ గణాంకాల ద్వారా ఎర్టిగా మార్కెట్లో ఉన్న స్థిరమైన డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. కేవలం తన 7 సీటర్ విభాగంలోనే కాకుండా, మొత్తం కార్ల అమ్మకాల్లోను ఎర్టిగా తనదైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అనేక కొత్త SUVలు, MPVలు మార్కెట్‌లో ప్రవేశిస్తున్నప్పటికీ, ఎర్టిగా చేసిన వృద్ధి గణాంకాలు చూసినప్పుడు ఇది పోటీకి ఎక్కడా తగ్గదని స్పష్టమవుతుంది. మహీంద్రా తన స్కార్పియో సిరీస్ (క్లాసిక్, ఎన్ఎ) అమ్మకాలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మే నెలలో అది 14,401 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానానికి పరిమితమైంది. స్పష్టంగా చెప్పాలంటే, స్కార్పియో ఒక్కోసారి మంచి రన్ ఇస్తున్నా, ఎర్టిగా స్థిరంగా చూపుతున్న పెర్ఫార్మెన్స్ ముందు కాస్త వెనుకబడినట్టే కనిపిస్తోంది. పోటీ ఎక్కువగా ఉన్న తరుణంలో ఎర్టిగా మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టంగా ముందుకు పోతుంది. మారుతీ ఎర్టిగా భారతీయ కుటుంబాల నమ్మకమైన ఎంపికగా నిలిచిన ఈ 7 సీటర్ MPV, శక్తివంతమైన ఇంజిన్, అధునాతన ఫీచర్లతో కూడిన ఇంటీరియర్ కారణంగా కూడా విశేష ఆదరణ పొందుతోంది. ఇంజిన్ విషయానికి వస్తే, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో, ఇది 103 PS పవర్‌ను, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మోడల్ లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజీ అందిస్తే, CNG వేరియంట్ 26.11 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: