ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి (A.S. Ravi Kumar Chowdary) మరణవార్త తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ వార్త తెలియగానే తెలుగు చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన గోపీచంద్ కథానాయకుడిగా తెరకెక్కిన 'యజ్ఞం' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆయన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఆ తర్వాత నాగార్జునతో ', నందమూరి బాలకృష్ణతో 'వీరభద్ర' వంటి భారీ ప్రాజెక్టులకు దర్శకత్వం వహించారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వెండితెరకు పరిచయమైన తొలి విడుదల చిత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం' కూడా ఈయన దర్శకత్వంలోనే రూపుదిద్దుకుంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'తిరగబడరా స్వామి' ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం. ఆయన మరణవార్తతో సహచర దర్శకులు, నటీనటులు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఏఎస్ రవికుమార్ చౌదరి మరణం తెలుగు సినిమాకు తీరని లోటని, ఆయన అందించిన చిరస్మరణీయ చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారని సినీ ప్రముఖులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..
జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..
కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: