Green Tax: వారికి భారీ శుభవార్త! ఇకపై రూ.20వేలు కట్టక్కర్లేదు.. జస్ట్ రూ.3వేలు కడితే చాలు!

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు డబుల్ ఫోల్డ్ మోడల్స్ మాత్రమే వచ్చినా, ఇప్పుడు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కొత్త సంచలనానికి తెరలేపబోతోంది. తొలిసారిగా ట్రై-ఫోల్డబుల్ మొబైల్‌ను గెలాక్సీ G ఫోల్డ్ పేరుతో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీంతో శాంసంగ్ మరోసారి మొబైల్ టెక్నాలజీలో కొత్త మైలురాయిని చేరుకోనుంది.

Vande Bharath: మొదటి వందే భారత్ స్లీపర్ ఎక్కడ నుండి? ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో ప్రయాణం! ప్రారంభం ఎప్పుడు అంటే!

గతేడాది శాంసంగ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (SDC)లో ఈ ట్రై-ఫోల్డబుల్ ఫోన్ నమూనాను మొదటిసారి ప్రదర్శించింది. అప్పటినుంచి ఈ మోడల్‌పై నిరంతర కసరత్తులు కొనసాగిస్తున్న కంపెనీ, ఈ ఏడాది జూలైలో జరగబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో అధికారికంగా ఆవిష్కరించే అవకాశం ఉందని సమాచారం. గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE మోడల్స్‌తోపాటు ఈ కొత్త ఫోన్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

Earthquakes: రాత్రికి రాత్రే మూడు భూకంపాలు! 2,200 మంది మృతి!

నవంబర్ 29, 2025న దక్షిణ కొరియాలో జరగబోయే ప్రత్యేక ఈవెంట్‌లో శాంసంగ్ ఒకేసారి మూడు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్‌ను తీసుకురానుంది. వీటిలో గెలాక్సీ G ఫోల్డ్ ట్రై-ఫోల్డ్ ఫోన్, ప్రాజెక్ట్ ముహాన్ పేరిట XR హెడ్‌సెట్, అలాగే AI గ్లాసెస్ ఉన్నాయి. ఈ మూడు డివైసులు 2026 ప్రారంభంలో ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.

Khairatabad Ganpati : దేశవ్యాప్తంగా ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్ గణపతి.. నిమజ్జనానికి కౌంట్‌డౌన్!

ప్రస్తుతం ట్రై-ఫోల్డ్ విభాగంలో హువావే మేట్ XT ఒక్కటే ఉన్నది. శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ దానికి ప్రధాన ప్రత్యర్థిగా నిలవనుంది. అయితే డిజైన్, డిస్‌ప్లే పరిమాణం, సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్ పరంగా శాంసంగ్ ఫోన్ మేట్ XT కంటే భిన్నంగా ఉండనుందని లీకులు సూచిస్తున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లో ట్రై-ఫోల్డ్ విభాగంలో పోటీ మరింత ఉత్కంఠ భరితంగా మారనుంది.

Nara Lokesh: సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌గా లోకేష్‌! అభినందించిన ఏపీ కేబినెట్.. ఎందుకంటే.?

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, గెలాక్సీ G ఫోల్డ్ 6.4–6.54 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 9.9–10.2 అంగుళాల మెయిన్ ఫోల్డబుల్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. డ్యూయల్ ఇన్నర్-ఫోల్డింగ్ మెకానిజం ఉండటం ప్రత్యేకత. అదనంగా 5,600mAh బ్యాటరీ, 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభించనుంది. అలాగే *S Pen సపోర్ట్* కూడా ఉండబోతుందని లీకులు సూచిస్తున్నాయి.

Heavy Rains: రెడ్ అలర్ట్ జారీ.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన! ఈ ప్రాంతాల్లో సెప్టెంబర్ 7 వరకు.!

ధర విషయానికి వస్తే, హువావే మేట్ XT దాదాపు 2,800 డాలర్లు (₹2.38 లక్షలు) ఖరీదుగా ఉండటంతో, శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ కూడా దానికి సమానంగా లేదా మరింత ఎక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొదట స్పెషల్ ఎడిషన్‌గా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఈ ఫోన్ ప్రీమియం కేటగిరీ యూజర్లను లక్ష్యంగా చేసుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Students Scholarship: పేద విద్యార్థులకు శుభవార్త.. రూ.12,000 స్కాలర్‌షిప్ అవకాశం!
Nominated Posts: మహిళలకు నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట.. 18 ఏఎంసీలకు ఛైర్మన్లను నియమించిన కూటమి ప్రభుత్వం!
GST CUT: చిన్న పట్టణాల థియేటర్లకు సెంట్రల్‌ గిఫ్ట్..! సినిమా టికెట్లపై జీఎస్టీ భారీగా తగ్గింపు!
APMSRB Jobs: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..! 48 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!