Airport: రేణిగుంట విమానాశ్రయంలో ఉద్రిక్తత..! స్పైస్ జెట్ సర్వీసు రద్దుతో ప్రయాణికుల నిరసన!

హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి అమానుషానికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఈ అధికారి, అనుమానాల కారణంగా ఆమెపై దాడి చేసినట్టు సమాచారం. చిన్న చిన్న గొడవలతో ప్రారంభమైన ఈ వ్యవహారం, చివరికి తీవ్ర హింసకు దారితీసింది. అధికారి ప్రవర్తనపై ఇప్పటికే స్థానికంగా విమర్శలు రావడం మొదలైంది.

Giorgio Armani: ఫ్యాషన్ ప్రపంచంలో ఒక లెజెండ్‌కు వీడ్కోలు.. జార్జియో అర్మానీ!

మహిళపై తీవ్ర అనుమానం పెంచుకున్న ఈ అధికారి, తరచూ గొడవలు పెట్టేవాడు. ఒకసారి ఘర్షణలో ఆమెను బలంగా కొట్టడంతో తలకు తీవ్రమైన గాయం జరిగింది. ఆ గాయం కారణంగానే ఆ మహిళ మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ప్రజలు ఒక ఉన్నతాధికారి ఇంత దారుణానికి పాల్పడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Flipkart: సెప్టెంబర్ 23 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్..! టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు!

ఈ సంఘటన అనంతరం తన ప్రభావాన్ని ఉపయోగించి కేసు నమోదు కాకుండా ప్రయత్నాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును గోల్‌మాల్ చేయడానికి అధికారి బలంగా ప్రయత్నించాడని సమాచారం. అంతేకాకుండా ఏమీ జరగనట్లుగా విజయవాడకు వెళ్లి తిరిగి తన విధుల్లో చేరిపోయాడు. ఈ ధోరణి పట్ల ప్రజల్లో విపరీతమైన అసహనం వ్యక్తమవుతోంది.

LPG: ఏపీలో గిరిజనులకు శుభవార్త..! 23,912 కుటుంబాలకు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు!

వివరాల ప్రకారం, ఈ అధికారి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో కీలకమైన శాఖలో చీఫ్‌గా వ్యవహరించాడు. జగన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పలు నిర్ణయాలు తీసుకున్నాడని, అలాగే కొన్ని అక్రమాలకు పాల్పడినట్టూ ఆరోపణలు ఉన్నాయి. ఆ కాలంలోనే ఈ అధికారి ప్రవర్తనపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

Chandrababu: చంద్రబాబుకు సరికొత్త హెలికాప్టర్! ఆ ఒక్క కారణంగానే ఈ కీలక నిర్ణయం!

సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఐదు పదుల వయస్సులోనూ వివాహేతర సంబంధాలకు పాల్పడటం, మహిళపై హింస చూపడం, చివరికి ప్రాణం తీశాడనే ఆరోపణలు అతని ప్రతిష్టను దెబ్బతీశాయి. అతని అరాచకాలు తెలిసినా కొందరు సహచర ఐఏఎస్ అధికారులు నోరు మెదపకపోవడం కూడా తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఒక ఉన్నతాధికారి ఇలాంటి పనులకు పాల్పడటం, వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసే అంశంగా మారింది. 

Iconic Bridge: ఏపీకి మరో మణిహారం! 5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి! డిజైన్‌ను మీరే ఎంపిక చేయొచ్చు!
Food Awareness: మద్యం తాగకపోయినా మత్తెక్కుతుందా? రోజూ ఇవి తింటున్నారా.. అయితే జాగ్రత్త!
Samsung Tri-fold Galaxy: శాంసంగ్ సంచలనం!లాంచ్ కు సిద్ధమవుతున్న ట్రై-ఫోల్డ్ గెలాక్సీ G ఫోల్డ్! ధర ఎంతంటే!
Vande Bharath: మొదటి వందే భారత్ స్లీపర్ ఎక్కడ నుండి? ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో ప్రయాణం! ప్రారంభం ఎప్పుడు అంటే!
Earthquakes: రాత్రికి రాత్రే మూడు భూకంపాలు! 2,200 మంది మృతి!