ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ.6,405 కోట్ల విలువైన రెండు ప్రాజెక్ట్‌లను ఆమోదించింది. ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం, లాజిస్టిక్స్ వ్యయాన్ని, చమురు దిగుమతులను, కర్బన్డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం ఆమోదించిన ప్రాజెక్టుల్లో 133కి.మీ పొడవైన కోడెర్మా-బర్కకానా డబ్లింగ్ ప్రాజెక్ట్, 185 కి.మీ పొడవైన బల్లారి-టిక్జాజుర్ డబ్లింగ్ ప్రాజెక్ట్ ఉన్నాయి. కోడెర్మా-బర్కకానా డబ్లింగ్ ప్రాజెక్టు ఝార్ఖండ్‌లోని ప్రధాన బొగ్గు ఉత్పత్తి ప్రాంతం గుండా వెళ్తుంది. అంతేకాదు ఇది పట్నా- రాంచీ మధ్య ప్రయాణ దూరాన్ని బాగా తగ్గిస్తుంది. బళ్లారి-చిక్జాజూర్ డబుల్ ప్రాజెక్ట్ కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుండా వెళ్తుంది. అంతే ఈ రెండు ప్రాజెక్టులు ఝార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు మేలు కల్గించనున్నాయి. "ఈ ప్రాజెక్టులు ప్రధాని మోదీ 'న్యూ ఇండియా' దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి దోహదం చేసి, ఈ ప్రాంత ప్రజలను 'ఆత్మనిర్భర్'గా చేస్తుంది.
ఇది కూడా చదవండి: నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
ఇవి వారి ఉపాధి/స్వయంఉపాధి అవకాశాలను పెంచుతుంది." అని కేంద్ర వ్యవహారాల కేబినెట్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లు ఝార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఏడు జిల్లాలను కవర్ చేస్తాయి. ఇవి భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను, కనెక్టివిటీని దాదాపు 318 కి.మీ మేర పెంచుతాయి. వీటి వల్ల మొత్తం 1,408 గ్రామాలు, 28.19 లక్షల మంది జనాభా లబ్ధి పొందుతారు. ఈ రెండు రైల్వే ప్రాజెక్ట్‌ల వల్ల అదనంగా బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, సిమెంట్, ఎరువులు, వ్యవసాయ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా చేయడానికి వీలు ఏర్పడుతుంది. ముఖ్యంగా సామర్థ్యం పెంపుదల పనుల వల్ల 49 ఎంటీపీఏ (సంవత్సరానికి మిలియన్ టన్నులు) పరిమాణంలో అదనపు సరకు రవాణా జరుగుతుంది. "రైల్వేలు పర్యావరణ అనుకూలమైనవి. వీటి ద్వారా తక్కువ ఇంధనంతో రవాణా చేయవచ్చు. లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించవచ్చు. చమురు దిగుమతులు (52 కోట్ల లీటర్లు) కూడా తగ్గించుకోవచ్చు. కర్బన (CO2) ఉద్గారాలను (264 కోట్ల కిలోలు) తగ్గించవచ్చు. ఇది 11 కోట్ల చెట్లను నాటడంతో సమానం" అని మంత్రివర్గం తెలిపింది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: