ప్రధాని మోదీ అమరావతికి రావడానికి ముందు మాజీ సీఎం జగన్ బెంగళూరుకు వెళ్లిపోవడంపై రాజకీయ వర్గాలు విమర్శలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసి, జగన్ మోదీ సభకు హాజరుకాని విధానంపై చర్చ జరుగుతోంది.
మూడు ముక్కలాటతో తాను విధ్వంసం చేసిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి.. ఇప్పుడు పునర్నిర్మాణం దిశగా పరుగులు పెట్టడం చూసి మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారు. పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు స్వయంగా ప్రధాని మోదీ వస్తుంటే.. ఆయన సభకు హాజరుకాకుండా బెంగళూరు యలహంక ప్యాలె్‌సకు వెళ్లిపోయారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు రావాలని రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా జగన్‌కు ఆహ్వానం అందజేసింది. తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు మోదీ అందించిన సహకారానికి కృతజ్ఞతగానైనా.. ఈ సభకు జగన్ హాజరు కావాలని కోరింది.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్..
దేశ ప్రధాని హోదాలో రాష్ట్రానికి వస్తున్న మోదీని మర్యాదపూర్వకంగానైనా కలిసి స్వాగతం పలకాల్సి ఉండగా.. జగన్ ముఖం చాటేసి ఒక రోజు ముందే బెంగళూరు వెళ్లిపోవడంపై రాజకీయ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం అనంతరం జగన్ ప్రతి శుక్రవారం యలహంక ప్యాలెస్‌కు వెళ్లిపోతున్నారు. సోమవారం రాత్రి గానీ, లేదంటే మంగళవారం గానీ వస్తున్నారు. అయితే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని వస్తుండడం.. రాష్ట్ర ప్రజలంతా భారీ సంఖ్యలో సభకు హాజరు కానుండడం.. వారికి ముఖం చూపించలేక పర్యటనను బహిష్కరించి.. ఒకరోజు ముందే బెంగళూరుకు వెళ్లిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!
మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..
అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ చిన్న పని తో..
కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!
6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: