ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హతలు:
అభ్యర్థి తప్పనిసరిగా ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, అలాగే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా (LLB) డిగ్రీ కలిగి ఉండాలి.
ఇంటర్ తర్వాత 5 ఏళ్ల లా కోర్సు పూర్తి చేసినవారూ అర్హులే.
అనుభవం:
2025 ఆగస్టు 4 నాటికి, అభ్యర్థి ఆంధ్రప్రదేశ్‌లోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 సంవత్సరాలపాటు అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
దరఖాస్తు తేదీలు:
2025 ఆగస్టు 11 నుంచి 2025 సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.