బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,04,950కు చేరుకుంది. గత ఐదు రోజుల్లో బంగారం ధరలు సుమారు రూ.3,440 పెరగడం గమనార్హం. ఇది పెట్టుబడిదారుల కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోని మార్పుల ప్రభావమని నిపుణులు చెబుతున్నారు.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.96,200గా నమోదైంది. ఒక్కరోజులోనే సుమారు రూ.1,500 పెరుగడం బంగారం కొనుగోలుదారులకు భారంగా మారింది. పెళ్లిళ్లు, వేడుకలు ముందుండటంతో జ్యువెలరీ షాపుల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నప్పటికీ, ధరల పెరుగుదల సాధారణ వినియోగదారులను ఆలోచనలో పడేస్తోంది.
అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1,31,000కు చేరింది. రోజురోజుకూ వెండి రేట్లు పెరుగుతుండటంతో చిన్న వ్యాపారులు, వెండి ఆభరణాలు కొనేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మొత్తం మీద రాష్ట్రాలన్నింటిలో దాదాపు ఇలాంటి ధరలే నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.