ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తీసుకొచ్చిన రూ.1కే అపరిమిత సర్వీసులు ఇచ్చే “ఆజాదీ కా ప్లాన్”కి వినియోగదారుల నుంచి ఊహించని ఆదరణ లభిస్తోంది. ఈ స్పందనను దృష్టిలో ఉంచుకొని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్ గడువును పొడిగించింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంచిన ఈ ప్లాన్‌ను ఇప్పుడు సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.
కేవలం రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అంతేకాదు, వినియోగదారులకు 4జీ సిమ్ ఉచితంగా ఇస్తోంది.
ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ ఎ. రాబర్ట్ జె. రవి మాట్లాడుతూ.. “మేక్ ఇన్ ఇండియా కింద దేశవ్యాప్తంగా ఆధునిక 4జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఈ ఆఫర్ వినియోగదారులకు తక్కువ ధరలో 4జీ సేవలు పొందే మంచి అవకాశం ఇస్తోంది” అన్నారు.
ఈ ప్లాన్‌ను పొందడానికి వినియోగదారులు సమీప బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధికారిక రిటైలర్‌ను సంప్రదించాలి. మరిన్ని వివరాల కోసం 1800-180-1503కి కాల్ చేయవచ్చు లేదా www.bsnl.co.inలో చూసుకోవచ్చు.