ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన APSSDC (AP State Skill Development Corporation) లో ఉద్యోగులు హాజరు వ్యవస్థను మోసం చేస్తున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అధికారుల విచారణలో ఫేసియల్ రికగ్నిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన APSSDC (AP State Skill Development Corporation) లో ఉద్యోగులు హాజరు వ్యవస్థను మోసం చేస్తున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అధికారుల విచారణలో ఫేసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (FRA) వ్యవస్థను కొన్ని మంది ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. నిజంగా ఉద్యోగానికి హాజరు కాకపోయినా, ఇతరుల ఫొటోలు లేదా టెక్నికల్ మార్గాలు ఉపయోగించి హాజరైనట్లు సిస్టమ్‌లో నమోదు చేసినట్లు గుర్తించారు.
ఈ మోసాలపై చర్యగా, ఇప్పటికే మూడు మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇంకా పదిమందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకే విభాగంలో 40 మంది ఉద్యోగులు హాజరు రికార్డులను మానిప్యులేట్ చేసినట్లు గుర్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖల్లో కూడా FRA అటెండెన్స్ వినియోగంపై సమీక్ష చేపట్టింది. ఇలా మోసపూరితంగా హాజరు నమోదయిందా లేదా అన్నది అన్ని శాఖల్లో విచారించనుంది.
ఈ సంఘటన డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్స్ భద్రతపై ప్రశ్నలు తీసుకొచ్చింది. ముఖ్య కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగుల ప్రమేయం ఉందేమోనన్న అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం టెక్నికల్ వెరిఫికేషన్‌ను మరింత కఠినంగా చేపట్టాలని నిర్ణయించింది. జియో ఫెన్సింగ్, ఫేసియల్ రికగ్నిషన్ వంటి ఆధునిక టెక్నాలజీ వాడకంపై నిఘా పెంచనుంది.
(FRA) వ్యవస్థను కొన్ని మంది ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. నిజంగా ఉద్యోగానికి హాజరు కాకపోయినా, ఇతరుల ఫొటోలు లేదా టెక్నికల్ మార్గాలు ఉపయోగించి హాజరైనట్లు సిస్టమ్‌లో నమోదు చేసినట్లు గుర్తించారు.