బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఎమ్మెల్సీ కవిత పీఆర్వోను తొలగించింది. కవిత ప్రెస్ నోట్లు, వీడియో క్లిప్పులు కూడా ఆ గ్రూపుల్లో ఇకపై లేవు. అలాగే హరీశ్ రావు, సంతోష్ రావులపై వ్యతిరేక వ్యాఖ్యల సారాంశం కూడా తొలగించారు.
ఇదిలా ఉండగా, అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఆదివారం హరీశ్ రావు మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో మద్దతుగా నిలిచింది.
"ఇది ఆరడుగుల బుల్లెట్టు" అంటూ బీఆర్ఎస్ ఘాటుగా రాసింది. "సింహం సింగిల్‌గానే వస్తుంది" అంటూ హరీశ్ రావును పొగడటమే కాకుండా, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఆధారాలతో తిప్పికొట్టారని పేర్కొంది.