ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ "తల్లికి వందనం" పథకం కింద చాలా మంది తల్లుల ఖాతాల్లో ఇప్పటికే ₹13,000 జమయ్యాయి. అయితే, కొంతమంది లబ్ధిదారులకు సాంకేతిక సమస్యలు, డేటా లోపాల వల్ల డబ్బులు జమ కాలేకపోయాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు కొత్తగా చేరిన విద్యార్థుల వివరాల్లో ఆధార్ తప్పులు, బ్యాంకు ఖాతా అచేతనం, విద్యుత్ వినియోగ పరిమితి మించిపోవడం వంటి కారణాలతో వారి చెల్లింపులు నిలిపివేయబడ్డాయి.
ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని సంబంధిత అధికారులు పెండింగ్ కేసులన్నీ పరిశీలిస్తున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, 2025 సెప్టెంబర్‌లో అన్ని పెండింగ్ చెల్లింపులను విడుదల చేసే అవకాశముంది.
ఇప్పటికీ డబ్బులు రాని లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని వివరాలు పరిశీలించిన తరువాత రెండో విడతలో చెల్లింపులు ఉంటాయి.
ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వ “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా, విద్యను ప్రోత్సహించేందుకు, విద్యార్థుల డ్రాపౌట్ తగ్గించేందుకు తీసుకువచ్చింది.