ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని రైతులకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఈ రైతులు, ఇప్పుడు మళ్లీ ఆశల వెలుగులోకి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంపై స్పష్టతనిచ్చిన నేపథ్యంలో, రైతులకు భరోసా కలిగిస్తోంది. ఇదే సమయంలో బ్యాంకుల నుంచి సహకారం రావడం కూడా పెద్ద ఊరటగా మారింది.
అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు హయాంలో returnable plots కేటాయించారు. అయితే, గత ప్రభుత్వం రాజధాని మార్పుపై తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ప్లాట్లపై loans ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. కానీ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తూ ఇతర బ్యాంకులకు రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు మంజూరు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ మార్పుతో రైతులు మళ్లీ తమ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకునే అవకాశాలు మెరుగయ్యాయి. ఇటీవల సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో రైతులు ఈ అంశాన్ని ప్రస్తావించగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకులు స్పందించాయి. ఫలితంగా రుణాల కోసం రైతులు మళ్లీ బ్యాంకులకెదురుచూస్తున్నారు. ఇది అమరావతి అభివృద్ధికి తోడ్పడే ప్రోత్సాహకరమైన పరిణామంగా చెప్పవచ్చు.