ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం (RTE) ఆధారంగా పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు విద్యార్థుల ఇళ్ల నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల్లో మాత్రమే ఈ అవకాశాన్ని వర్తింపజేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఈ పరిధిని 5 కిలోమీటర్లకు పెంచారు. అంటే ఇకపై విద్యార్థుల నివాస ప్రాంతానికి 5 కిమీ దూరంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఉచిత సీట్లు కేటాయిస్తుంది.
ఈ చర్య వల్ల మరింత మంది విద్యార్థులకు admission లభించే అవకాశం ఉంది. పేద, బలహీన వర్గాల పిల్లలకు 25% సీట్లు రిజర్వ్ చేయాలని RTE చట్టం ప్రకారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, అనాథలు, దివ్యాంగులు, HIV బాధితులకు ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం రూ.1.2 లక్షల లోపు, పట్టణాల్లో రూ.1.44 లక్షల లోపు ఉన్న కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ప్రత్యేకంగా ‘తల్లికి వందనం’ పథకానికి లబ్ధిదారులు అయిన తల్లులు ఉచిత సీటు పొందిన విద్యార్థుల కోసం స్కూల్ ఫీజు చెల్లించేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ అమలుకు implementation బాధ్యతను సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు అప్పగించారు. ఈ విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో విద్యకు మరింత అందుబాటును కల్పించనుంది.