భారతదేశంలో సాధారణంగా రైల్వే స్టేషన్లంటే కోలాహలం, గందరగోళం, మురికిగా కనిపించే వాతావరణమే గుర్తుకు వస్తుంది. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో ఉన్న **రాణీ కమలాపతి రైల్వే స్టేషన్** మాత్రం ఇందుకు విరుద్ధంగా, అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ స్టేషన్. ఇది భారత్‌లోని మొట్టమొదటి private రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఈ స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం కలిసి partnership ద్వారా అభివృద్ధి చేశాయి.
ఇది మొదట “హబీబ్‌గంజ్” స్టేషన్‌గా పిలవబడేది. 2021 నవంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్టేషన్‌ను పునర్నిర్మించి, "రాణీ కమలాపతి"గా పేరుమార్చి ప్రారంభించారు. గోండ్ రాజ్యానికి చెందిన రాణీ కమలాపతి గౌరవార్థం ఈ పేరు ఇచ్చారు. ఈ స్టేషన్‌లో విశాలమైన ప్రాంతం, ఆధునిక వెయిటింగ్ లౌంజ్‌లు, సౌరశక్తితో నడిచే పరికరాలు, సీసీటీవీ భద్రత, ఫుడ్ కోర్టులు, బ్రాండ్ షాపులు వంటి అనేక ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉన్నాయి.
ఈ స్టేషన్ నిర్వహణను బన్సల్ గ్రూప్ ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిసి చేపడుతోంది. యాజమాన్యం రైల్వే శాఖదే అయినా, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ రంగానికి అప్పగించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఇది రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కొత్త దిశగా మారిన అడుగుగా చెప్పవచ్చు.