దేశ రక్షణలో అత్యంత కీలక శాఖగా ఎదుగుతున్న ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌లో చేరాలని యువత ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. భూసైన్యంలో హెలికాప్టర్ కార్యకలాపాలను నిర్వహించే ఈ విభాగం యుద్ధభూమి నుంచి విపత్తు ప్రాంతాల వరకు ఎన్నో కీలక ఆపరేషన్లలో ప్రాణాలు కాపాడుతోంది. కొత్త తరహా హెలికాప్టర్లు, అధునాతన ఎయిర్ సర్వైలెన్స్ వ్యవస్థలతో సిద్ధమవుతున్న ఈ విభాగంలో చేరడానికి అభ్యర్థులు తీసుకోవాల్సిన దశలు, అర్హతలు, శిక్షణ ప్రక్రియలపై భారత సైన్యం స్పష్టమైన వివరాలు వెల్లడించింది.
ఏవియేషన్ కార్ప్స్ పాత్ర ఏమిటి..
ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ ప్రస్తుతం ధ్రువ్, చేతక్ వంటి యుటిలిటీ హెలికాప్టర్లను నిర్వహిస్తుంది. యుద్ధ ప్రాంతాల్లో సైన్యానికి మద్దతు ఇవ్వడం, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, ప్రళయాల సమయంలో రక్షణ చర్యలు—ఇంతా ఈ విభాగం బాధ్యతల్లోనే ఉంది. ఇటీవల లైట్ కాంబాట్ హెలికాప్టర్ (LCH) చేరడంతో ఆర్మీ ఏవియేషన్ మరింత శక్తివంతమైంది. రిమోట్‌పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ (RPAS/UAV) బాధ్యతలు కూడా ఈ విభాగానికే అప్పగించబడటంతో సర్వైలెన్స్ సామర్థ్యం బలపడింది.
శిక్షణ కేంద్రం — నాసిక్‌లోని CATS
సైన్యంలో ఏవియేటర్లు కావాలనుకునే ప్రతి అధికారి శిక్షణ పొందే ప్రధాన కేంద్రం నాసిక్‌లోని కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (CATS). 2003లో ప్రారంభమైన ఈ సంస్థ Category-A స్థాయిలో పనిచేస్తూ, సైన్యంలో ఉన్నత స్థాయి పైలట్లను తయారు చేస్తోంది. ఎడారి ప్రాంతాలనుంచి హిమాలయాల ఎత్తైన ప్రదేశాల వరకు వివిధ వాతావరణాల్లో హెలికాప్టర్ నడిపే శిక్షణ CATSలో అందించబడుతుంది.
శిక్షణలో భాగంగా..
బేసిక్ మరియు అడ్వాన్స్‌డ్ ఫ్లయింగ్
టాక్టికల్ ఫ్లయింగ్
హెలికాప్టర్ సిమ్యులేటర్ శిక్షణ
RPAS / UAV ఆపరేషన్
కాంబాట్ ఏవియేషన్ కోర్సులు ఉంటాయి. తదుపరిశిక్షణ పూర్తిచేసిన అధికారులకు ఏవియేషన్ వింగ్స్ ప్రదానం చేసి, ఆపరేషనల్ యూనిట్లకు పోస్టింగ్ ఇస్తారు.
ఆర్మీ ఏవియేషన్‌లో చేరడానికి అర్హతలు..
సివిలియన్ అభ్యర్థులు నేరుగా ఏవియేషన్ కార్ప్స్‌లో చేరే అవకాశం లేదు. తప్పనిసరిగా ముందుగా కమిషన్డ్ ఆఫీసర్‌గా సైన్యంలో చేరాలి.
సైనిక అధికారిగా అవ్వడానికి ప్రధాన మార్గాలు..
NDA (ఇంటర్మీడియట్ తర్వాత)
CDS (గ్రాడ్యుయేషన్ తర్వాత)
టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ – ఇంజినీరింగ్ విద్యార్థులకు
NCC స్పెషల్ ఎంట్రీ
SSC నాన్-టెక్/టెక్ ఎంట్రీ SSB మరియు మెడికల్ పరీక్షలు క్లియర్ చేసిన తర్వాత IMA లేదా OTAలో శిక్షణ పొందుతారు.
ఏవియేషన్‌కు వాలంటీర్‌గా ఎలా దరఖాస్తు చేయాలి..
అధికారిగా సేవలో ఉన్నప్పుడు స్వచ్ఛందంగా ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌కు అప్లై చేయాలి
మెడికల్ ఫిట్‌నెస్, పనితీరు, అప్ట్ిట్యూడ్ ఆధారంగా ఎంపిక పైలట్ అప్ట్ిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (PABT) లేదా కొత్త వ్యవస్థ CPSS ఉత్తీర్ణత తప్పనిసరి
ఎవరు అప్లై చేయవచ్చు..
ఇప్పటికే సైన్యంలో కమిషన్డ్ ఆఫీసర్లై ఉన్నవారు
కఠినమైన ఫ్లయింగ్ మెడికల్ స్టాండర్డ్స్‌కు అర్హత సాధించినవారు.
ఏవియేషన్ డైరెక్టరేట్ స్క్రీనింగ్‌లో ఉత్తీర్ణులైనవారు
భారత సైన్యం దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ఈ ఏవియేషన్ విభాగంలో చేరాలనుకునే అభ్యర్థులకు 2025లో అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. దేశ సేవతో పాటు వైమానిక కార్యకలాపాల్లో భవిష్యత్ నిర్మించాలనుకునే యువతకు ఇది అరుదైన అవకాశంగా భావిస్తున్నారు