Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..! ఎంపిక విధానం మరియు అర్హతలు! Answer Key: RRB పారామెడికల్ పరీక్ష రాశారా? మీ మార్కులను ఇప్పుడే చెక్ చేసుకోండి...! Defense Jobs: టెన్త్, ఐటిఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..! ఎస్‌ఎస్‌బీ రిక్రూట్‌మెంట్..! Navy Jobs: 10వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..! ఎంపిక విధానం మరియు అర్హతలు! Answer Key: RRB పారామెడికల్ పరీక్ష రాశారా? మీ మార్కులను ఇప్పుడే చెక్ చేసుకోండి...! Defense Jobs: టెన్త్, ఐటిఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..! ఎస్‌ఎస్‌బీ రిక్రూట్‌మెంట్..! Navy Jobs: 10వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..!

Pharmacy Jobs: బి.ఫార్మసీ, డి.ఫార్మసీ చదివారా? ఏపీలో పశు ఔషధి కేంద్రాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు ఔషధి విక్రయ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. బి.ఫార్మసీ, డి.ఫార్మసీ అభ్యర్థులు ఈ కేంద్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా రైతులకు తక్కువ ధరకే మందులు మరియు యువతకు ఉపాధి లభించనుంది.

Published : 2026-02-04 16:31:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పశువులకు సోకే వ్యాధులను అరికట్టడంతో పాటు, వైద్య ఖర్చులను తగ్గించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ‘పశు ఔషధి విక్రయ కేంద్రాల’ను (Pashu Aushadhi Vikray Kendras) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జాతీయ పశువుల వ్యాధి నియంత్రణ కార్యక్రమం’ (NADCP) లో భాగంగా ఈ కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి. ఈ పథకం ద్వారా అటు పాడి రైతులకు మేలు చేకూర్చడంతో పాటు, ఇటు ఫార్మసీ చదివిన నిరుద్యోగ యువతకు సొంతూళ్లలోనే ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మరియు మండల కేంద్రాల్లో ఈ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి బి.ఫార్మసీ (B.Pharmacy) లేదా డి.ఫార్మసీ (D.Pharmacy) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అర్హత ఉన్న అభ్యర్థులు వ్యక్తిగతంగా గానీ లేదా సహకార సంఘాల ద్వారా గానీ ఈ కేంద్రాలను దరఖాస్తు చేసుకోవచ్చు. పశువుల మందుల విక్రయానికి సంబంధించి డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుండి లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి.

మౌలిక సదుపాయాలు - నిబంధనలు

ఈ పశు ఔషధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది:

స్థలం: కనీసం 120 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన షాపు లేదా గది ఉండాలి. ఇది సొంత స్థలం కావచ్చు లేదా అద్దెకు తీసుకున్నదైనా అనుమతిస్తారు.

నిర్వహణ: ఈ కేంద్రాలను ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు లేదా సహకార సమాఖ్యల అనుబంధంతో నిర్వహించవచ్చు.

మందుల నాణ్యత: మందుల సేకరణ, క్వాలిటీ టెస్టింగ్ మరియు సరఫరా బాధ్యతలను ‘ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా’ (PMBI) పర్యవేక్షిస్తుంది. దీనివల్ల రైతులకు నాణ్యమైన మందులు అందుబాటులోకి వస్తాయి.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో పశువుల మందుల ధరలు సామాన్య రైతులకు భారంగా మారుతున్నాయి. ఈ కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన ఔషధాలు లభించడం వల్ల వెటర్నరీ వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ కేంద్రాలను నిర్వహించే వారికి ప్రోత్సాహకంగా 20 శాతం మేర ఆపరేటివ్ మార్జిన్ ఇన్సెంటివ్‌ను ప్రభుత్వం అందజేయనుంది.

దరఖాస్తు చేసుకోండిలా..

ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://pashuaushadhi.dahd.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అదనపు సమాచారం లేదా సందేహాల కోసం సంబంధిత జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయాలను సంప్రదించవచ్చు. రాష్ట్రంలో పశు సంపదను కాపాడుతూ, లైవ్ స్టాక్ ప్రొడక్టివిటీని పెంచేందుకు ఈ పథకం ఒక గేమ్ ఛేంజర్‌గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Spotlight

Read More →