Job Calendar: నిరుద్యోగ యువతకు తీపికబురు…! ఉగాది నాటికి ఏపీ జాబ్ క్యాలెండర్! SBI CBO: ఎస్‌బీఐలో కొలువుల జాతర 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే! Central Bank Jobs: నెలకు లక్ష జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు..! 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..! అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త.. రెగ్యులర్ ఉద్యోగులుగా మారే గోల్డెన్ ఛాన్స్! SBI Career Benefits: ఎస్‌బీఐ పీఓ జీతం చూస్తే దిమ్మతిరగాల్సిందే.. నెలకు లక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాలరీ వివరాలు! Amazon: అమెజాన్‌లో భారీ లేఆఫ్స్...! కారణం ‘కల్చర్’ అంటున్న సీఈఓ! RRB Recruitment: రైల్వేలో 312 ఉద్యోగాలు..! అప్లై చేయడానికి కేవలం 2 రోజులు మాత్రమే! Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్..! 10వ తరగతి అర్హతతో RBIలో 572 పోస్టులు! Job News: టెన్త్ తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశం.. పూర్తి వివరాలు ఇవే! ఇస్రోలో భారీ నోటిఫికేషన్.. నెలకు రూ. 2.08 లక్షల వరకు వేతనం..!! Job Calendar: నిరుద్యోగ యువతకు తీపికబురు…! ఉగాది నాటికి ఏపీ జాబ్ క్యాలెండర్! SBI CBO: ఎస్‌బీఐలో కొలువుల జాతర 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే! Central Bank Jobs: నెలకు లక్ష జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు..! 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..! అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త.. రెగ్యులర్ ఉద్యోగులుగా మారే గోల్డెన్ ఛాన్స్! SBI Career Benefits: ఎస్‌బీఐ పీఓ జీతం చూస్తే దిమ్మతిరగాల్సిందే.. నెలకు లక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాలరీ వివరాలు! Amazon: అమెజాన్‌లో భారీ లేఆఫ్స్...! కారణం ‘కల్చర్’ అంటున్న సీఈఓ! RRB Recruitment: రైల్వేలో 312 ఉద్యోగాలు..! అప్లై చేయడానికి కేవలం 2 రోజులు మాత్రమే! Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్..! 10వ తరగతి అర్హతతో RBIలో 572 పోస్టులు! Job News: టెన్త్ తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశం.. పూర్తి వివరాలు ఇవే! ఇస్రోలో భారీ నోటిఫికేషన్.. నెలకు రూ. 2.08 లక్షల వరకు వేతనం..!!

SBI Career Benefits: ఎస్‌బీఐ పీఓ జీతం చూస్తే దిమ్మతిరగాల్సిందే.. నెలకు లక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాలరీ వివరాలు!

ఎస్‌బీఐలో పీఓగా పనిచేస్తున్న యువతి తన లక్ష రూపాయల పైచిలుకు జీతం వివరాలను తెలిపారు. అలవెన్సులు, ఇంక్రిమెంట్ల తర్వాత చేతికి వచ్చే జీతం ఎంతంటే...

Published : 2026-01-28 08:47:00

శాలరీ స్లిప్ వైరల్.. ఎస్‌బీఐ ఆఫీసర్ జీతం ఎంతో తెలుసా?

లక్ష దాటిన వేతనం.. ఆ అదనపు ఆదాయం వెనుక రహస్యమిదే!

సాఫ్ట్‌వేర్ వర్సెస్ బ్యాంకింగ్.. ఏ ఉద్యోగం నెలకు ఎక్కువ ఇస్తోంది?

ప్రపంచంలో ఎన్నో ఉద్యోగాలు చేసిన ప్రతి వ్యక్తి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలు రా బాబు అనుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది భద్రత ప్రశాంతం అని కూడా చెప్పుకోవచ్చు. ఉదయానే 9:00 కు వెళ్లి సాయంత్రం 5:00 కి ఇంటికి చేరుకొని కుటుంబంతో సరదాగా గడపొచ్చు  అనే భావన కలుగుతుంది. ముఖ్యంగా రోజు పై అధికారుల నుండి ఒత్తిడి అనేది తగ్గుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం భద్రత మాత్రమే కాదు  భారీ జీతభత్యాలు కూడా ఉంటాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి నిరూపించింది. 

బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)గా పనిచేస్తున్న ఒక యువతి తన నెలవారీ ఆదాయాన్ని సోషల్ మీడియాలో బహిర్గతం చేయడంతో నిరుద్యోగులు మరియు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కేవలం రెండున్నరేళ్ల అనుభవానికే ఆమె నెలకు రూ. 1.25 లక్షలకు పైగా వేతనాన్ని అందుకుంటుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

శ్వేతా ఉప్పల్ అనే ఎస్‌బీఐ పీఓ, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన శాలరీ స్లిప్ వివరాలను పంచుకున్నారు.ఈ వీడియో బ్యాంకింగ్ రంగం వైపు మొగ్గు చూపే యువతకు సరికొత్త ఉత్సాహాన్నిస్తోంది. అని ఆమె తెలిపి జీతం లెక్కలివే అని వివరించారు.. ఒక ఎస్‌బీఐ ఆఫీసర్ కేవలం బేసిక్ పే పైనే కాకుండా వివిధ రకాల అలవెన్సుల ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు.  ఇన్-హ్యాండ్ శాలరీ అన్నీ పోనూ నెలకు దాదాపు ₹95,000 నగదు చేతికి వస్తుంది. లీజ్ రెంటల్  ఇంటి అద్దె కోసం బ్యాంకు అదనంగా ₹18,500 కేటాయిస్తుంది. ఇతర అలవెన్సులు పెట్రోల్, వార్తాపత్రికలు, వినోదం మరియు ఇతర సౌకర్యాల కోసం నెలకు మరో ₹11,000 అందుతాయి. ఇవన్నీ కలిపితే నెలకు సుమారు ₹1.24 లక్షలకు పైగా వేతనం లభిస్తోంది.

సాధారణంగా బ్యాంకు ఉద్యోగాల్లో వార్షిక ఇంక్రిమెంట్లు  మాత్రమే ఉంటాయి. కానీ శ్వేత తన తెలివితేటలతో అతి తక్కువ కాలంలోనే 5 ఇంక్రిమెంట్లను సాధించారు. బ్యాంకింగ్ రంగంలో ప్రొఫెషనల్ కోర్సులుగా పరిగణించే JAIIB మరియు CAIIB పరీక్షలను ఆమె త్వరగా పూర్తి చేశారు. ఈ సర్టిఫికేషన్లు సాధించిన వారికి బ్యాంకు అదనపు జీతపు పెంపును అందిస్తుంది. దీనివల్ల సాధారణంగా వచ్చే జీతం కంటే ఆమెకు నెలకు కొన్ని వేల రూపాయలు అదనంగా వస్తున్నాయి.

ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కంటే బ్యాంకు కొలువులే మేలు అని కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరు ఇంత జీతం వెనుక పని ఒత్తిడి కూడా భారీగానే ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఒక మధ్యతరగతి గ్రాడ్యుయేట్ తన ప్రతిభతో నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించవచ్చని ఈ వీడియో నిరూపించింది.

ఒక పీఓ బ్యాంకులో చేరిన తర్వాత కేవలం క్యాషియర్ పనులకే పరిమితం కారు. వీరు మేనేజ్మెంట్ స్థాయిలో శిక్షణ పొందుతారు. లోన్ ప్రాసెసింగ్ కస్టమర్ల రుణ దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేయడం. పర్యవేక్షణ బ్యాంకు సిబ్బంది పనితీరును మరియు రోజువారీ లావాదేవీలను చెక్ చేయడం. మార్కెటింగ్ బ్యాంకు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం. కీలక విభాగాలు అయినా ఫారెక్స్  ఇన్వెస్ట్‌మెంట్ మరియు ట్రెజరీ వంటి కీలక ఆర్థిక విభాగాల్లో బాధ్యతలు ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తేనే అంతటి జీతాలను ఆశించగలరు అని బ్యాంకు నిపుణులు తెలుపుతున్నారు.

Spotlight

Read More →