పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో మే నెలలో భారత్–పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పటికీ అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని యూఎస్ చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ విడుదల చేసిన తాజా నివేదిక కొత్త వివాదానికి దారి తీసింది. ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలను చైనా తన ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి అవకాశం లా ఉపయోగించుకుందని ఆ నివేదిక చేసిన ఆరోపణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.
అమెరికా నివేదిక ప్రకారం భారత్–పాక్ మధ్య జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో చైనాకు చెందిన HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలు, PL-15 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, J-10 యుద్ధ విమానాలు ప్రత్యక్ష యుద్ధ ప్రదేశాల్లో మొట్టమొదటిసారి వినియోగించబడ్డాయి. ఇవి చైనా ఆయుధ వ్యవస్థలు ‘వాస్తవ పరిస్థితుల్లో’ ఎలా పనిచేస్తాయో పరిశీలించేందుకు ఒక సాధక వాతావరణంగా వ్యవహరించాయని నివేదిక పేర్కొంది. ఈ పరీక్షలు చైనా రక్షణ పరిశ్రమ పటిష్టతను ప్రపంచానికి చూపించేందుకు ఉపయోగపడినట్టు కమిషన్ విశ్లేషించింది.
ఇదితో పాటు పాక్ వైపు నిలబడి చైనా భారీ స్థాయిలో ఆధునిక ఆయుధాలు సరఫరా చేసిందనే ఆరోపణలు కూడా నివేదికలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఐదో తరం జే–35 యుద్ధ విమానాలు, కేజే–500 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను పాకిస్థాన్‌కు అందించడానికి చైనా సిద్ధమైనట్టు నివేదిక పేర్కొంది. యుద్ధం ముగిసిన కొద్ది వారాల్లోనే చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాల ద్వారా తమ ఆధునిక ఆయుధాల సామర్థ్యాలను ప్రశంసించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించిందని కూడా నివేదిక ఆరోపించింది.
రఫేల్ యుద్ధ విమానాలపై చైనా చేసిన తప్పుడు ప్రచారం మరో కీలక అంశంగా నిలిచింది. జే–35 జెట్ల పనితీరును ప్రశంసిస్తూ, ఒకే సమయంలో రఫేల్ సామర్థ్యాన్ని తగ్గించేలా ఏఐ వీడియోలు, మార్చిన ఫోటోలు ఉపయోగించి కల్తీ ప్రచారం నడిపిందని నివేదిక పేర్కొంది. ఇండోనేషియాతో ఇప్పటికే ఉన్న రఫేల్ డీల్‌ను నిలిపివేయడానికి చైనా ఒత్తిడి తీసుకువచ్చినట్టు కూడా ఆరోపణ ఉంది.
ఈ నివేదికను చైనా పూర్తిగా తోసిపుచ్చింది. అమెరికా కమిషన్ ఎప్పటిలాగే పక్షపాత ధోరణితో పనిచేస్తోందని, ఈ నివేదికలో విశ్వసనీయత లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తీవ్రంగా ఖండించారు. భారత్–పాక్ ఘర్షణల్లో తమ పాత్రపై వచ్చిన ఆరోపణలు “పూర్తిగా అసత్యాలు” అని పేర్కొన్నారు.
అమెరికా నివేదికతో చైనా పాత్రపై మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. భారత్–పాక్ మధ్య ఉత్పన్నమైన ఉద్రిక్తతలను చైనా ఎలా చూసింది? నిజంగా ఆయుధాల ప్రమోషన్‌కు ఈ పరిస్థితులను వాడుకుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయంగా తెరపైకి వచ్చాయి. ఈ అంశం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే ఇరుదేశాలు, అంతర్జాతీయ పరిశీలకులు ఇంకా మరిన్ని వివరాలు బయటపెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి