⚡ BREAKING

పోలియో రహిత సమాజమే లక్ష్యం.. చిన్నారులకు మంత్రి సవిత పోలియో చుక్కలు!

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే అభివృద్ధికి పునాది అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. చిన్నారులను పోలియో వ్యాధి నుంచి రక్షించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Polio Drops In Vijayawada
Polio Drops In Vijayawada

విజయవాడ మధురానగర్లో పల్స్ పోలియో కార్యక్రమం.. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్..

రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం..

విజయవాడ: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే అభివృద్ధికి పునాది అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. చిన్నారులను పోలియో వ్యాధి నుంచి రక్షించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

విజయవాడలోని మధురానగర్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు వేసే రెండు పోలియో చుక్కలు వారి భవిష్యత్తు జీవితానికి ఎంతో రక్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

పోలియో వ్యాధి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వార్డు పరిధిలోని కేంద్రాలు, ఆసుపత్రుల్లో కూడా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పారు.

ఆరోగ్యంగా ఉన్న ప్రజలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సవిత అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం కాపాడటం అంటే భవిష్యత్ తరాల భద్రతకు బలమైన పునాది వేయడమేనని మంత్రి పేర్కొన్నారు.

Tags

Be the first to react

Latest