ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 35వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

35. ఓం నిత్యానంద ప్రదాయై నమః

అర్థం: ఇక్కడ ఎప్పుడూ మనం సుఖశాంతులు కోరుకొంటాం. కానీ ఇవన్నీ వచ్చి పోతున్నాయి. కాసేపు కుర్చీలో కూర్చుంటే సుఖం. ఎక్కువసేపు కూర్చుంటే కష్టం. వంకాయ కూర ఇష్టం. అలా అని రోజూ తింటే వెగటు. ఇట్లా ఏదయినా సరే, బయటినుంచి సంతోషం కలిగించేది తాత్కాలికమే. ఇవన్నీ చాలా అల్పమైనవి, అశాశ్వతమైనవి, వచ్చి పోయేవి. చూసేవి, వినేవి, తినేవి, తాకేవి - అన్నీ అంతే. ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖభోగాలు అన్నీ చివరికి దుఃఖమే కలిగిస్తున్నాయి. ఆత్మీయుడు కనపడితే సుఖం. చనిపోతే దుఃఖం. ఒక వస్తువు చాలా సంతోషాన్ని ఇస్తుంది అనుకొంటాం. అది పగిలిపోయింది. దుఃఖం వచ్చింది. ఇవన్నీ ఆది, అంతం ఉన్నటువంటివి. శాశ్వతమైన దానినుంచి శాశ్వతమైన దానిని పొందుతాం. వచ్చి పోయే దాని నుంచి వచ్చి పోయే దానినే పొందుతాం.

బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్‌ ।
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ॥ 5.21

అర్థం: జ్ఞాని అయినవాడు బాహ్య విషయాల పట్ల అనాసక్తిని ఏర్పరచుకొంటాడు. తానే సుఖ స్వరూపం, శాంతి స్వరూపం అని తెలిసి, ఆ రీతిగా ఉంటాడు. కాబట్టి నేను నేనుగా ఉంటే నాకు కలిగేది అక్షయ సుఖం. ఎప్పుడూ ఉండేది.

సంతోషం బయట దొరుకుతుందా? కస్తూరి మృగం తనలోనే ఉన్న కస్తూరి సువాసన తెలుసుకోలేక బయట వెదుకుతూ  గాయాల పాలవుతుంది. అలాగే మనలోనే ఉన్న సంతోషాన్ని తెలుసుకోలేక, జీవితమంతా వస్తువుల్లో వెదుకుతున్నాం.  

నీవు స్వతహాగా ఆనంద స్వరూపానివి. ఈ దేహం అసత్‌. అంటే ఎప్పటికీ ఉండేది కాదు. జడ దుఃఖ స్వరూపం. ఆత్మగా నీవు సత్‌ చిత్‌ ఆనంద స్వరూపానివి. మరి దుఃఖిస్తున్నది ఎవరు? మనస్సు. మనోమాలిన్యం నీపై ఆవరించి, నీ సహజ  స్వభావమైన ఆనందాన్ని కమ్మేస్తున్నది. జ్ఞానేంద్రియాల వలన కలిగే శీతోష్ణాలు, అంతరింద్రియమైన మనసులో కలిగే సుఖదుఃఖాలు మొదలగు ద్వంద్వాలు అన్నీ కూడ వచ్చి పోతూ ఉంటాయి. నీవు ఆ కదలికలను గమనిస్తూ ఉండు. అదే ఎరుక, గమనిక. చూడు. విను, తిను, తాకు, వాసన చూడు - ఈ అన్నింటిలో ఉంటూనే తామరాకుపై నీటిబొట్టు వలె ఉండమని గీతాబోధ.

నేను ఆ తండ్రి బిడ్డనై, ఆ తండ్రి అంశనై, ఆత్మ స్వరూపమై ఉన్నాను. నేను ఆనంద స్వరూపాన్ని అనే వివేకం కలిగిస్తున్న గీతామాతకు ఆనందంతో అంజలి ఘటిస్తున్నాను.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 34 : Bhagavad Gita : మరణ భయమే గొప్పది, కానీ జీవుడు దేహం కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -34!

నామం 33 : Bhagavad Gita : మనసులో శాంతి, మాటల్లో మృదుత్వం, కష్టాల్లో ఓర్పు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -33!

నామం 32 : Bhagavad Gita: సంసార మహాసాగరంలో విజయ మార్గం చూపే గీతామాత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -32! 

నామం 31 : Bhagavad Gita: వైరాగ్యం అంటే రాగరహిత స్థితి.. దుఃఖానికి దూరమైన ఆత్మశాంతి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా31!

నామం 30 : Bhagavad Gita: కర్మ చేయడమే నీ అధికారం.. ఫలానికి కాదు.. గీతా బోధ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -30!

నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!

నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!

నామం 27 : Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!

నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!

నామం 25 : Bhagavad Gita: భగవద్గీతలోని త్రిమూర్తి రహస్యం.. సృష్టి, స్థితి, లయకు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -25!

నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!

నామం 23 : Bhagavad Gita: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని ఉపదేశం.. మానవాళికీ మార్గదర్శనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా23!

నామం 22 : Bhagavad Gita: మహాపాపిని మహాత్మునిగా మార్చగల శక్తి గీత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-22!

నామం 21 : Bhagavad Gita: ఓం పరమ పవిత్రాయై నమః.. జ్ఞానం కన్నా పవిత్రం మరొకటి లేదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా!

నామం 20 : Bhagavad Gita: దుష్టులను సత్పురుషులుగా మార్చగల మహాశక్తి గీతాజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 20!

నామం 19 : Bhagavad Gita: దేహం నశించేది దేహి నాశనం లేనివాడు, నిత్యుడు.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 19!

నామం 18 : Bhagavad Gita: కురుక్షేత్ర సంగ్రామం జీవిత సమరానికి ప్రతీక.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-18!

నామం 17 : Bhagavad Gita: జీవి మూలం, గమ్యం, ఉద్దేశ్యం తెలుసుకోవటం జ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -17!

నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!

నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!

నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!

నామం 13 : Bhagavad Gita: యజ్ఞక్రియల ద్వారా దేవశక్తిని ప్రసన్నం చేసే మంత్రాలు వేదాల్లో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -13!

నామం 12 : Bhagavad Gita: సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే.. జీవుడు పరమాత్మ వేరే కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 12!

నామం 11 : Bhagavad Gita: ప్రతి క్షణం గీతామాతను స్మరించడం ద్వారానే జీవిత సఫలం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-11!