జియోను వెనక్కి నెట్టిన ఎయిర్‌టెల్.. ఇంటర్నెట్ సేవల్లో నంబర్ వన్!

Jio VS Airtel: హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారులకు కీలక విషయం. ఇంటర్నెట్ వేగం, నాణ్యత, నెట్‌వర్క్ స్థిరత్వం వంటి అంశాల్లో ఎయిర్‌టెల్(Airtel) అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ టెలికాం సంస్థలు జియో(Jio), బీఎస్ఎన్ఎల్‌ను(BSNL) వెనక్కి నెట్టి ఐదు విభాగాల్లోనూ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఓపెన్‌సిగ్నల్ (Opensignal) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

Airtel Beats Jio and BSNL in Broadband Speed Rankings
Airtel Beats Jio and BSNL in Broadband Speed Rankings
  • ఓపెన్‌సిగ్నల్ నివేదిక ప్రకారం ఇంటర్నెట్ వేగం, నాణ్యత, నెట్‌వర్క్ విశ్వసనీయతలో ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో నిలిచి జియో, బీఎస్ఎన్ఎల్‌ను వెనక్కి నెట్టింది.
  • వినియోగదారుల సంఖ్యలో మాత్రం జియో 1.48 కోట్లతో ముందుండగా, ఎయిర్‌టెల్ 1.14 కోట్లతో రెండో స్థానంలో ఉంది.

Jio VS Airtel: హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారులకు కీలక విషయం. ఇంటర్నెట్ వేగం, నాణ్యత, నెట్‌వర్క్ స్థిరత్వం వంటి అంశాల్లో ఎయిర్‌టెల్(Airtel) అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ టెలికాం సంస్థలు జియో(Jio), బీఎస్ఎన్ఎల్‌ను(BSNL) వెనక్కి నెట్టి ఐదు విభాగాల్లోనూ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఓపెన్‌సిగ్నల్ (Opensignal) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

ఐదు విభాగాల్లో ఎయిర్‌టెల్ హవా

భారత్‌లోని ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ సేవల పనితీరుపై ఓపెన్‌సిగ్నల్ సంస్థ తాజా నివేదిక విడుదల చేసింది. ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్ విశ్వసనీయత, స్థిరమైన నాణ్యత, డౌన్‌లోడ్ స్పీడ్, అప్‌లోడ్ స్పీడ్, వీడియో అనుభవం వంటి ఐదు అంశాలను పరిశీలించింది.

ఈ ఐదు విభాగాల్లోనూ ఎయిర్‌టెల్(Airtel) అత్యుత్తమ పనితీరు కనబరిచింది. నెట్‌వర్క్ విశ్వసనీయత విషయంలో ఎయిర్‌టెల్ 486 పాయింట్లు సాధించగా, జియో 423 పాయింట్లతో వెనుకబడింది.

ఇంటర్నెట్ వేగంలోనూ ముందంజ

డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాల్లో ఎయిర్‌టెల్ జియో కంటే సుమారు 26 నుంచి 27 శాతం మెరుగైన పనితీరు కనబరిచింది. అయితే ఈ విభాగాల్లో బీఎస్ఎన్ఎల్ కూడా గట్టి పోటీ ఇచ్చింది.

డౌన్‌లోడ్ స్పీడ్‌లో ఎయిర్‌టెల్ కంటే బీఎస్ఎన్ఎల్ కేవలం 0.5 Mbps మాత్రమే వెనుకబడింది. అప్‌లోడ్ స్పీడ్‌లోనూ 0.8 Mbps తేడాతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఇంటర్నెట్ వేగం విషయంలో బీఎస్ఎన్ఎల్(BSNL) కూడా ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇస్తోందని స్పష్టమవుతోంది.

ఎయిర్‌ఫైబర్ సేవల్లోనూ అదే జోరు

వైర్‌లెస్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలైన ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) విభాగంలోనూ ఎయిర్‌టెల్(Airtel) అగ్రస్థానంలో నిలిచింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్(Airtel Xtream) ఎయిర్‌ఫైబర్, జియో(Jio) ఎయిర్‌ఫైబర్ వంటి సేవల పనితీరును కూడా నివేదికలో పరిశీలించారు.

ఈ విభాగంలో ఎయిర్‌టెల్(Airtel) సగటు డౌన్‌లోడ్ వేగం 32.4 Mbpsగా నమోదైంది. జియో(Jio) 25.7 Mbps వేగాన్ని మాత్రమే అందించింది. అప్‌లోడ్ వేగంలో ఎయిర్‌టెల్(Airtel) 20.7 Mbps సాధించగా, జియో(Jio) 17.1 Mbpsతో నిలిచింది.

అలాగే నెట్‌వర్క్ నాణ్యత విషయంలో ఎయిర్‌టెల్(Airtel) 66.2 శాతం స్కోర్ సాధించగా, జియో(Jio) 55 శాతానికే పరిమితమైంది.

ఎక్కువ మంది కస్టమర్లు జియోకే!

పనితీరులో ఎయిర్‌టెల్ (Airtel)ముందున్నప్పటికీ, వినియోగదారుల సంఖ్యలో మాత్రం జియో(Jio) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆగస్టు 2026 గణాంకాల ప్రకారం..

  • జియో(Jio): 1.48 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు
  • ఎయిర్‌టెల్(Airtel): 1.14 కోట్ల వినియోగదారులు
  • బీఎస్ఎన్ఎల్(BSNL): 46 లక్షల వినియోగదారులు

మొత్తంగా చూస్తే, వినియోగదారుల సంఖ్యలో జియో(Jio) ముందుండగా, ఇంటర్నెట్ పనితీరు, వేగం, నాణ్యత వంటి అంశాల్లో ఎయిర్‌టెల్(Airtel) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నివేదిక ఏప్రిల్ 1 నుంచి జూన్ 29, 2026 వరకు సేకరించిన నెట్‌వర్క్ డేటా ఆధారంగా రూపొందించారు.

Tags

Be the first to react

Latest