సరదాగా కొన్న లాటరీ టికెట్‌తో రూ.30 కోట్లు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన తెలుగోడు!
Jagtial Man Wins ₹30 Crore Lottery: మలేసియాలో సరదాగా కొనుగోలు చేసిన ఓ లాటరీ టికెట్ జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబంలో ఆనందాన్ని నింపింది. మనవడి పేరుతో కొన్న టికెట్‌కు ఏకంగా రూ.30 కోట్ల బహుమతి రావడంతో ఆ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అప్పుడప్పుడు లాటరీ టికెట్లు కొనుగోలు చేసే రాజారెడ్డికి ఈసారి ఊహించని స్థాయిలో అదృష్టం వరించింది.
మలేసియాలో జగిత్యాల వాసికి రూ.30 కోట్ల లాటరీ.. మనవడి పేరుతో కొన్న టికెట్‌తో కోటీశ్వరుడైన రాజారెడ్డి..
15 ఏళ్లుగా మలేసియాకు రాకపోకలు.. ఈసారి రూ.30 కోట్ల లాటరీతో అదృష్టం వరించింది..
మలేసియాలో సరదాగా కొనుగోలు చేసిన ఓ లాటరీ టికెట్ జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబంలో ఆనందాన్ని నింపింది. మనవడి పేరుతో కొన్న టికెట్‌కు ఏకంగా రూ.30 కోట్ల బహుమతి రావడంతో ఆ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అప్పుడప్పుడు లాటరీ టికెట్లు కొనుగోలు చేసే రాజారెడ్డికి ఈసారి ఊహించని స్థాయిలో అదృష్టం వరించింది.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఎంచురాల రాజారెడ్డి ఉపాధి కోసం గత 15 ఏళ్లుగా మలేసియాకు వెళ్లి వస్తున్నారు. అక్కడ పనిచేస్తూనే అప్పుడప్పుడు లాటరీ టికెట్లు కొనుగోలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల మలేసియాలో కేరళకు చెందిన ‘కన్నూర్ చక్కరకల్’ లాటరీ సంస్థకు సంబంధించిన నాలుగు టికెట్లను కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేశారు.
ఈ నెల 26న నిర్వహించిన లాటరీ డ్రాలో రాజారెడ్డి తన మనవడు అయాన్రెడ్డి పేరుతో కొనుగోలు చేసిన టికెట్‌కు రూ.30 కోట్ల బహుమతి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఈ విషయం తెలియగానే రాజారెడ్డి ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురయ్యారు. తన కుటుంబానికి ఇంత పెద్ద మొత్తం బహుమతిగా రావడంతో తొలుత నమ్మలేకపోయారు. అనంతరం వెంటనే కుటుంబ సభ్యులకు, చిట్టాపూర్ గ్రామంలోని స్నేహితులకు ఫోన్ చేసి ఈ శుభవార్తను తెలియజేశారు.
రాజారెడ్డి నుంచి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందంలో మునిగిపోయారు. గ్రామంలోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మనవడి పేరుతో కొనుగోలు చేసిన టికెట్‌కు భారీ బహుమతి రావడం కుటుంబంలో మరింత ప్రత్యేకమైన ఆనందాన్ని నింపింది.
లాటరీకి సంబంధించిన చెక్కును సంస్థ ప్రతినిధులు రెండ్రోజుల క్రితం రాజారెడ్డికి అందజేశారు. దీంతో రూ.30 కోట్ల బహుమతి గెలుచుకున్నట్లు అధికారికంగా తెలిసి కుటుంబ సభ్యుల సంతోషం మరింత పెరిగింది. అప్పుడప్పుడు సరదాగా కొనుగోలు చేసే లాటరీ టికెట్ ఒక కుటుంబ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది.
Tags
Be the first to react
