నాడు మాటల తూటాలు.. నేడు పశ్చాత్తాపం! కేటీఆర్‌కు వరుసగా క్షమాపణలు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పారు. ప్రతిపక్ష నేతను విమర్శించే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశానని, అయితే అవి నిరాధారమైనవని, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
- మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పారు.
- కేటీఆర్ పాస్‌పోర్టు వార్తలో ఇటీవల ఈనాడు కూడా క్షమాపణలు కోరింది.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పారు. ప్రతిపక్ష నేతను విమర్శించే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశానని, అయితే అవి నిరాధారమైనవని, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత దూషణలపై విచారం
కేటీఆర్‌ను లేదా ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశంతో తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని పేర్కొన్నారు. తన మాటల వల్ల కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురై ఉంటే అందుకు చింతిస్తున్నానని తెలిపారు. గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిస్తూ క్షమాపణలు చెప్పారు.
కేటీఆర్‌పై ఆరోపణలు.. ఇప్పుడు క్షమాపణలు
గతంలో సినీ నటి సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారానికి సంబంధించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ, సినీ వివాదానికి దారితీశాయి. ఆ సందర్భంలో కేటీఆర్‌పై ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై ఆమె క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈనాడు కూడా క్షమాపణలు
మరోవైపు, ఇటీవల ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు కూడా కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పిన విషయం చర్చకు వచ్చింది. కేటీఆర్ పాస్‌పోర్టును సీజ్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించినట్లు ఈనాడు ప్రచురించిన వార్తపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు.
దీనిపై స్పందించిన ఈనాడు యాజమాన్యం, పాస్‌పోర్టు వ్యవహారంలో ప్రచురించిన వార్తలో తప్పు జరిగిందని అంగీకరించినట్లు సమాచారం. ఆ వార్త ఉద్దేశపూర్వకంగా ప్రచురించింది కాదని వివరణ ఇస్తూ, పొరపాటుకు విచారం వ్యక్తం చేసి క్షమాపణలు కోరింది. ఈ వివాదాన్ని ముగించాలని కేటీఆర్ తరఫు న్యాయవాదిని కోరినట్లు తెలుస్తోంది.
రాజకీయంగా చర్చనీయాంశం
ఒకవైపు పాస్‌పోర్టు వార్త విషయంలో ఈనాడు క్షమాపణలు చెప్పడం, మరోవైపు గత వ్యాఖ్యలపై కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. అయితే ఈ రెండు పరిణామాలు వేర్వేరు సందర్భాల్లో చోటుచేసుకున్నప్పటికీ, కేటీఆర్‌కు సంబంధించిన వివాదాల్లో క్షమాపణలు కీలక అంశంగా మారడం విశేషం.
Be the first to react