జెన్-జీ నిరసనలతో అట్టుడికిన జర్మనీ..34 నగరాల్లో ఆందోళనలు, వీధుల్లో విధ్వంసం!

Germany Gen Z Protest News: జర్మనీలో యువత చేపట్టిన జెన్-జీ (Gen-Z) ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ‘జెన్ జెడ్ రెగెల్ట్’ (Gen-Z Regelt) పేరుతో శనివారం రాత్రి దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పలు నగరాల్లో హింసాత్మక ఘటనలుగా మారాయి. విద్యారంగానికి నిధుల తగ్గింపు, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ప్రజా సేవల్లో నాణ్యత తగ్గడం, తప్పనిసరి సైనిక సేవ వంటి అంశాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చారు. బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ సహా సుమారు 34 నగరాల్లో ఈ ఆందోళనలు జరిగాయి.

Germany Gen Z Protests Turn Violent in 34 Cities
Germany Gen Z Protests Turn Violent in 34 Cities
  • జర్మనీలో విద్యా నిధుల కోత, పెరుగుతున్న జీవన వ్యయం, తప్పనిసరి సైనిక సేవకు వ్యతిరేకంగా 34 నగరాల్లో వేలాది మంది జెన్-జీ యువత నిరసనలు చేపట్టారు.
  • ఫ్రాంక్‌ఫర్ట్ సహా పలు నగరాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులపై దాడులు, దుకాణాల ధ్వంసం చోటుచేసుకోగా, పలువురిని అరెస్టు చేశారు.

Germany Gen Z Protest News: జర్మనీలో యువత చేపట్టిన జెన్-జీ (Gen-Z) ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ‘జెన్ జెడ్ రెగెల్ట్’ (Gen-Z Regelt) పేరుతో శనివారం రాత్రి దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పలు నగరాల్లో హింసాత్మక ఘటనలుగా మారాయి. విద్యారంగానికి నిధుల తగ్గింపు, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ప్రజా సేవల్లో నాణ్యత తగ్గడం, తప్పనిసరి సైనిక సేవ వంటి అంశాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చారు. బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ సహా సుమారు 34 నగరాల్లో ఈ ఆందోళనలు జరిగాయి.

ఫ్రాంక్‌ఫర్ట్‌లో విధ్వంసం.. దుకాణాలపై దాడులు

ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిరసనకారుల ఆందోళనలు అదుపుతప్పాయి. నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో దుకాణాల అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు కొన్ని చోట్ల దోపిడీలకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఓ ఆయుధాల దుకాణంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, సీసాలు, మోలోటోవ్ కాక్‌టెయిల్స్ విసరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో అధికారులు నగరంలోని ప్రముఖ జీల్ షాపింగ్ వీధిని మూసివేశారు. నగర కేంద్రాన్ని ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

పలు నగరాల్లో పోలీసులతో ఘర్షణలు

ఫ్రాంక్‌ఫర్ట్‌తో పాటు హ్యాంబర్గ్, కొలోన్, బెర్లిన్ నగరాల్లోనూ నిరసనలు హింసాత్మకంగా మారాయి. హ్యాంబర్గ్‌లో ఆందోళనకారులు బారికేడ్లకు నిప్పుపెట్టగా, ఇతర నగరాల్లో పోలీసులతో ఘర్షణలకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు, పెప్పర్ స్ప్రేలను ప్రయోగించారు. ఈ ఘటనల్లో పలువురు పోలీసు సిబ్బంది గాయపడగా, పెద్ద సంఖ్యలో నిరసనకారులను అరెస్టు చేశారు.

సంస్కరణల కోసం పోరాటం అంటున్న నిర్వాహకులు

తమ ఉద్యమం హింస కోసం కాదని, శాంతి, స్వేచ్ఛతో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో మెరుగైన సంస్కరణలు సాధించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకురాలు లినా ఫ్రెడ్రిక్ స్పష్టం చేశారు. అయితే తొలుత శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారడంపై జర్మనీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనల వెనుక తీవ్రవాద గ్రూపుల ప్రమేయం ఉండే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

మొత్తంగా యువత సమస్యలపై మొదలైన ఈ ఉద్యమం హింసాత్మక మలుపు తిరగడంతో జర్మనీలో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Be the first to react

Latest