AP Govt: మాజీ మంత్రి కొడాలి నాని కేసులో ముందడుగు.. విచారణకు అనుమతించిన ప్రభుత్వం!

AP Govt: మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసులో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రాసిక్యూషన్ కొనసాగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Kodali Nani
Kodali Nani

కొడాలి నాని వ్యాఖ్యల కేసులో పెండింగ్కు తెర.. విచారణకు మార్గం సుగమం..

ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు.. కొడాలి నానిపై కేసు దర్యాప్తుకు అనుమతి..

అమరావతి: మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసులో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రాసిక్యూషన్ కొనసాగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కృష్ణా జిల్లా కలెక్టర్ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.

2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొడాలి నాని చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి నివేదిక పంపింది.

ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు అనుమతితో గుడివాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రజాప్రతినిధులపై కేసుల్లో విచారణ కొనసాగించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం కావడంతో ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్లో ఉంది.

తాజాగా ప్రభుత్వం అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి విచారణకు అనుమతి మంజూరు చేసింది. దీంతో కేసు తదుపరి దశకు వెళ్లనుంది.

Tags

Be the first to react

Latest