MadanaPalli: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. మదనపల్లె టీడీపీలో కొత్త జోష్.. మహిళా అధ్యక్షురాలిగా బైగారి భారతి నాయుడు నియామకం!

MadanaPalli: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో కీలకమైన అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా మహిళా నాయకురాలు శ్రీమతి బైగారి భారతి నాయుడు గారు అధికారికంగా నియామకమయ్యారు.

MadanaPalli: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. మదనపల్లె టీడీపీలో కొత్త జోష్..
madanapalle tdp baigari bharathi naidu appointed as the woman president
  • Politics: చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు కృతజ్ఞతలు తెలిపిన భారతి నాయుడు!

  • కష్టపడిన కార్యకర్తలకు టీడీపీలో సముచిత స్థానం.. భారతి నాయుడు నియామకంతో నిరూపితం!

MadanaPalli: మదనపల్లి నియోజకవర్గంలో మహిళా అధ్యక్షురాలిగా బైగారి భారతి నాయుడు నియమించారు.  తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాలు జెండా ఎగరలేని స్థితిలో ఉన్నప్పుడు ఈసారి మదనపల్లెలో ఎలాగైనా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు మదనపల్లెకు సరైన మైనారిటీ నాయకుడు శ్రీ మహమ్మద్ షాజహాన్ భాష అయితే గెలుపొందుతారని అనేక సర్వేలు చేయించి షాజహాన్ భాషా గారికి టికెట్ కేటాయించడం జరిగింది. ఆ తర్వాత మదనపల్లె నియోజకవర్గంలో ఒక మహిళా నాయకురాలిగా రాత్రి పగలు పార్టీ గెలుపు కోసం నియోజకవర్గం లోని మండలాలు గ్రామాలు అంతా తిరిగి అహర్నిశలు కష్టపడి 2024 సం#లో మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ భాషా ని గెలిపించుకోవడం జరిగింది.

ఎన్నికల్లో తన వంతు సహాయ సహకారాలు అందించి, నిరంతరం కష్టపడినందుకు గాను పార్టీ అధిష్ఠానం భారతి నాయుడు గారి సేవలను గుర్తించి తగిన గౌరవం కల్పించింది. మదనపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా అత్యంత బాధ్యతాయుతమైన పదవిని కట్టబెట్టింది. ఈ సందర్భంగా తనకు ఈ అరుదైన గుర్తింపును ఇచ్చి, మహిళా అధ్యక్షురాలిగా నియమించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ అండ్ మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మరియు గౌరవ మదనపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ షాజహాన్ భాషా శ్రీమతి బైగారి భారతి నాయుడు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరుస్తానని ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Be the first to react

Latest