ఎన్నికల హింస కేసులపై ఫోకస్.. కలెక్టర్లు, ఎస్పీలకు CEO వివేక్ యాదవ్ కీలక ఆదేశాలు

AP Election Commission: అమరావతిలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం CEO వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నికల హింస కేసులపై ఫోకస్.. కలెక్టర్లు, ఎస్పీలకు CEO వివేక్ యాదవ్ కీలక ఆదేశాలు
ఎన్నికల హింస కేసులపై ఫోకస్.. కలెక్టర్లు, ఎస్పీలకు CEO వివేక్ యాదవ్ కీలక ఆదేశాలు

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో CEO వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్.

2024 ఎన్నికల సమయంలో, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సమీక్ష.

హింసకుసంబంధించినకేసులనువేగంగాపరిష్కరించాలనిఆదేశం.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం CEO వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో, ఆ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని జిల్లా అధికారులకు CEO సూచించారు. ఆయా ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల పురోగతిని పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ముఖ్యంగా ఎన్నికల హింసకు సంబంధించిన కేసుల విషయంలో దర్యాప్తు, తదుపరి న్యాయపరమైన ప్రక్రియ వేగంగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పల్నాడు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో, అనంతరం చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన కేసులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Be the first to react

Latest