Praja Vedika: నేడు (17/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయంలో 17 సెప్టెంబర్ 2026 (గురువారం)న ప్రజా సమస్యల స్వీకరణ, పరిష్కారం కోసం నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమం షెడ్యూల్ ఖరారైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి, ఏపీ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మన్నె సుబ్బారెడ్డి, ఏపీ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ శ్రీ నీలాయపాలెం విజయ్ కుమార్ పాల్గొని ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి నేరుగా వినతులు, అర్జీలను స్వీకరించనున్నారు.
తేదీ 17-09-2026 (గురువారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 17 సెప్టెంబర్ 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ కొలుసు పార్థసారథి గారు
(గౌరవ మంత్రివర్యులు)
2.శ్రీ మన్నె సుబ్బారెడ్డి గారు
(ఆంధ్రప్రదేశ్ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)
3.శ్రీ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు
(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు)
Tags
Be the first to react
