సౌదీ అరేబియాలో ఇంటి డ్రైవర్ గా పనిచేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లికి చెందిన ఒక వలస కార్మికుడికి స్థానిక ఆచార వ్యవహాలు, చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వలన మూడున్నర ఏళ్ల జైలు శిక్ష పడి రియాద్ జైల్లో మగ్గుతున్న సంఘటన జరిగింది. ఫిబ్రవరి ఒకటిన జైలు పాలయిన బాలనర్సు కు సౌదీ లోని ఇండియన్ ఎంబసీ ద్వారా న్యాయ సహాయం అందించి, క్షమాబిక్ష ఇప్పించాలని అతని భార్య నక్క దేవేంద్ర శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్ లోని 'ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సెలవుపై సౌదీ నుంచి వచ్చిన సామాజిక సేవకులు అసాని రాజిరెడ్డి, మహ్మద్ నవీద్ లతో కలిసి ఆమె సీఎం ప్రజావాణి ఇంచార్జి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవారాజన్ ను కలిసి గోడు వెళ్ళబోసుకున్నారు.

ఇది కూడా చదవండి: Air India Incident: టెన్షన్‌.. టెన్షన్‌.. మరో ఘోరం.. ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన పక్షి!

ఇంటి డ్రైవర్ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా బాలనర్సు తన అరబ్ యజమాని పిల్లలను పాఠశాలకు తీసికెళ్లేవాడని, పిల్లలతో స్నేహపూర్వక ప్రవర్తను యజమాని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఆమె పేర్కొన్నారు. స్థానిక ఆచార వ్యవహారాలు, సున్నితత్వం తెలియకపోవడం వల్ల అపోహలకు దారితీసి జైలుపాలయ్యాడని ఆమె తెలిపారు. వెంటనే స్పందించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవారాజన్, రాష్ట్ర ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారి సిహెచ్. శివ లింగయ్యతో మాట్లాడారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ, సౌదీ అధికారుల వద్దకు క్షమాభిక్ష అభ్యర్థనను పంపడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

New Road Service: ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ! 4 వరుసలుగా .. మారనున్న ఆ ప్రాంతం రూపు రేఖలు!

Hyderabad Star Hotels: వచ్చే ఆరేళ్లలో 25 స్టార్ హోటళ్లు... ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్!

Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..

Air India Incident: టెన్షన్‌.. టెన్షన్‌.. మరో ఘోరం.. ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన పక్షి!

kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!

Cognizant: వైజాగ్‌కు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు!

World Bank Visits: పరుగులు పెడుతున్న అమరావతి రాజధాని పనులు.. వరల్డ్ బ్యాంక్, ADB బృందాలు!

Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..

MLA Seats నియోజకవర్గాల విభజన పై కసరత్తు! ఆ 50 సీట్ల లిస్టు! ఏ పార్టీకి అనుకూలం.?

kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!

AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group