సాధారణంగా గుమ్మడికాయ అంటే చాలామంది ఇష్టపడరు. కానీ గుమ్మడికాయ, దాని గింజల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే, వాటిని అస్సలు వదిలిపెట్టరు.గుమ్మడికాయను సాధారణంగా హల్వా, కూర లేదా వడియాల రూపంలో తీసుకుంటారు.
బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే గుమ్మడి రసం తాగితే తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు పొందవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో, గుమ్మడి గింజల్లోని పోషక విలువలు తెలుసుకుని వాటిని తినడం కూడా బాగా పెరిగింది.
గుమ్మడి గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఔషధంలా పనిచేస్తుంది. వీటిలో ఉండే కరొటినాయిడ్స్, విటమిన్ ఇ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. ముఖ్యంగా, ఇవి జీర్ణాశయం, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో సహాయపడతాయి.
డయాబెటిస్ ఉన్నవారు గుమ్మడి గింజల్లోని ట్రిగోనెల్లిన్, నికోటినిక్ ఆమ్లం, ఐనోసిటల్ వంటి సమ్మేళనాలు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.వీటిలో ఉండే మెగ్నీషియం రక్తపోటు (బీపీ)ని నియంత్రించి గుండెకు రక్షణగా పనిచేస్తుంది. గుమ్మడి గింజల్లోని జింక్, విటమిన్స్ ఖనిజాలను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తాయి.ఈ గింజల్లోని ప్రోటీన్స్ కండరాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు తగిన మోతాదులో గుమ్మడి గింజలను తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, జింక్ వంటివి మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి నిద్రను ప్రేరేపిస్తాయి.
ముఖ్యమైన విషయం ఏమిటంటే, రోజుకు ఒక స్పూన్ కన్నా ఎక్కువ గుమ్మడి గింజలను తీసుకోకూడదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు నిపుణులను సంప్రదించడం మంచిది.