బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'స్పిరిట్' సినిమాకు సంబంధించి నెలకొన్న వివాదంపై సీనియర్ దర్శకుడు మణిరత్నం స్పందించారు. దీపికా కొన్ని షరతులు విధించారని, వాటిలో భాగంగా రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని, రూ.20 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కావాలని, తెలుగులో డైలాగులు చెప్పనని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై మణిరత్నం మాట్లాడుతూ దీపికా డిమాండ్లను గట్టిగా సమర్థించారు.
న్యూస్ 18కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ... "ఆమె డిమాండ్లు పూర్తిగా సరైనవని నేను భావిస్తున్నాను. అలాంటి డిమాండ్లు చేసే స్థాయిలో ఆమె ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఒక చిత్ర నిర్మాతగా, నటీనటులను ఎంపిక చేసేటప్పుడు ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. చిత్ర పరిశ్రమలో వృత్తిపరమైన సరిహద్దులు ఉండాలి. ఫిల్మ్‌మేకర్స్ అలాంటి అవసరాలను గుర్తించి, అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా పనిచేయాలి" అని తెలిపారు.
దీపికా విషయంలో మణిరత్నం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో నటులు అజయ్ దేవగణ్, సైఫ్ అలీ ఖాన్ కూడా దీపికా వైఖరికి మద్దతు పలికిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
ముఖ్యంగా 8 గంటల పనివేళల గురించి అజయ్ దేవగణ్ ప్రస్తావిస్తూ... "ఈ విషయం చాలా మందికి రుచించడం లేదనడం సరికాదు. నిజాయితీగల చాలా మంది చిత్రనిర్మాతలకు దీంతో సమస్య ఉండదు. దీనికి తోడు తల్లిగా ఉంటూ ఎనిమిది గంటలు పనిచేయడం అనేది కష్టం" అని పేర్కొన్నారు. పని-జీవిత సమతుల్యత ప్రాముఖ్యతను, ముఖ్యంగా పనిచేసే తల్లులకు ఇది ఎంత అవసరమో ఆయన నొక్కి చెప్పారు.
ఈ వివాదం సినిమా పరిశ్రమలో వృత్తిపరమైన అంచనాలు, పని పరిస్థితులపై సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. కొందరు దీపికా డిమాండ్లను "అన్‌ప్రొఫెషనల్" అని విమర్శిస్తుండగా, మరికొందరు ఆమె వైఖరికి మద్ధతుగా నిలుస్తున్నారు.
ఈ చర్చ కొనసాగుతున్న తరుణంలో, దీపికాకు మణిరత్నం మద్ధతు పలకడం, పరిశ్రమలో పనివేళలు, వృత్తిపరమైన హద్దుల విషయంలో మారుతున్న దృక్పథాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదల తర్వాత ఆయన కొన్ని రోజులు విరామం తీసుకోనున్నారని తెలుస్తోంది. అనంతరం తన తర్వాతి ప్రాజెక్టుపై దృష్టిసారించనున్నారు. ప్రస్తుతం తన దగ్గర నాలుగు స్క్రిప్ట్‌లు ఉన్నా.. వాటిలో ఏదీ పూర్తిగా సిద్ధం కాలేదని మణిరత్నం తెలిపారు.
ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: