ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ ఆర్థిక స్థోమత ఉన్న ఎవరైనా వేలంలో పాల్గొనవచ్చు.. గత ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్సార్ ఎంఐజీ టౌన్‌షిప్‌లను కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌లుగా మార్చింది. ఈ మేరకు ప్లాట్ల కేటాయింపులో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.. ఈమేరకు త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనుంది ప్రభుత్వం.
గత ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల కోసం 36 వైఎస్సార్ ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఈ ప్రాజెక్టులు ఆగిపోయాయి. అయితే కొన్ని టౌన్‌షిప్‌లలో లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు.. కానీ వాటి రిజిస్ట్రేషన్లు మాత్రం జరగలేదు. దీంతో ప్లాట్లు అలాగే ఉండిపోయాయి. ఈ టౌన్‌షిప్‌లలో ప్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌లుగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సీనియర్ అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేసి.. వారి సూచనల ప్రకారంకొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నారన్నారు.
ఇది కూడా చదవండి: విశాఖ టూ శ్రీలంక ప్రత్యేక టూర్! ఇప్పుడు తక్కువ ధరలోనే!
అయితే లాటరీ ద్వారా ఏ ప్లాట్ వస్తుందో తెలియదు.. ఒకవేళ లాటరీలో వచ్చిన తర్వాత వాస్తు ప్రకారం ప్లాట్ లేదని చాలామంది తీసుకోవడానికి ఇష్టపడరనే వాదన వినిపిస్తోంది. అందుకే గతంలో కొనుగోలు చేసిన వాటికి కూడా వాయిదాల చెల్లింపులు ఆగాయంటున్నారు. ఈ క్రమంలో ప్లాట్ల నంబర్ల వారీగా వేలం నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనగా చెబుతున్నారు. ఇలా చేస్తే ప్రజలు ముందుగా ప్లాట్లను చూసి తమకు నచ్చిన వాటిని వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది అంటున్నారు. గతంలో వార్షికాదాయం రూ.18 లక్షలు ఉన్నవారికే అవకాశం ఉండేది. ఈ క్రమంలోచాలా మందికి ఛాన్స్ దక్కలేదు.. ఇప్పుడు ఆ నిబంధనను తొలగించాలని చూస్తున్నారు.
ఆర్థిక స్థోమత ఉంటే చాలు ఎవరైనా వేలంలో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందట. ఈ వేలంలో పాల్గొనేవారు ముందుగా విలువలో 10% చెల్లించాలని.. ఒకవేళ ప్లాట్ దక్కకపోతే ఆ డబ్బు తిరిగి ఇవ్వరని చెబుతున్నారు. వేలం ద్వారా ప్లాట్ల కేటాయిస్తే కనుక రూ.2-4 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఒక అంచనా ఉంది. ఈ డబ్బుతో టౌన్‌షిప్‌లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. కొనుగోలు చసిన వారికి కూడా నమ్మకం కలుగుతుంది అంటున్నారు. మరి ఈ ప్లాట్లకు ప్రజల నుంచి ఏ మేరకు స్పందన వస్తుందన్నది చూడాలి. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసి ఈ వేలం ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!
ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!
ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!
డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!
స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!
హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: