పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి అందించేలా చర్యలు చేపట్టామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు.
అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. "ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పింఛను మొత్తాన్ని పెంచాం. పేదవాడి కోసం పింఛన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్. ప్రజల ఆదాయం పెంచి అన్ని విధాలుగా ఆదుకుంటాం. అధిక పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మాది పేదల ప్రభుత్వం. మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఉచితంగా మూడు వంటగ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. పేదలకు మూడుపూటలా అన్నం పెట్టాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించే ఆలోచించాలి.
ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
ప్రతి గ్రామానికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు వెళ్లాలి. పింఛను ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే సమస్యలు తెలుస్తాయి. పేదల కోసం కష్టపడుతున్నాం. చేప ఇవ్వడమే కాదు పట్టిచ్చే విధానం నేర్పుతాం. భర్త చనిపోతే ఆటోమేటిక్‌గా భార్యకు పింఛను ఇచ్చే వెసులుబాటును తీసుకొచ్చాం. మూడు నెలల వరకు పింఛను తీసుకునే వెసులుబాటు కల్పించాం. భర్త చనిపోతే భార్య అనాథగా మిగిలిపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్‌లో మతకలహాలను తుదిముట్టించాం. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అంతం చేశాం. ప్రస్తుతం రాయలసీమలో ముఠాలు, ఫ్యాక్షనిజం లేదు. కొందరు స్వార్థపరులు విగ్రహాలతో రాజకీయాలు చేస్తున్నారు. స్వార్థపరులు చేసే పనులకు మనం ప్రతిస్పందించొద్దు. పేదల ఆదాయం పెరగాలి జీవనప్రమాణం పెరగాలి. 2029లోపు పేదరికం తగ్గింపునకు కృషి చేస్తాం. 2029 నుంచి ఆర్థిక అసమానతలు తగ్గింపునకు కృషి చేస్తాం.
రేపటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తాం. ఎప్పుడు వీలైతే అప్పుడు తెచ్చుకునేలా రేషన్ పంపిణీ ఉంటుంది. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ. గతంలో డోర్ డెలివరీ పేరిట రేషన్ సరఫరా చేశారు. రేషన్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వాళ్లే తీసుకొని కాకినాడ పోర్టుకు తీసుకొచ్చేవారు. రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు వేస్తాం. అందరికీ సామాజిక న్యాయం చేయడం నా బాధ్యత. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు న్యాయం చేస్తా. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని కొందరు కుయుక్తులు చేస్తున్నారు. పాస్టర్ సహజంగా మరణిస్తే దానిని రాజకీయం చేయాలని చూశారు. ఎవరైనా తప్పు చేస్తే చండశాసనుడిలా వెంటాడుతా. బాబాయ్‌ను చంపి నారాసుర రక్తచరిత్ర అని మాపై నెట్టారు. నాది డేగ కన్ను ఎవరూ నా నుంచి తప్పించుకోలేరు. ఎవరు తప్పు చేసినా టెక్నాలజీ ద్వారా కనిపెడతాం. తప్పు చేసిన వారు తప్పించుకోలేరు" అని చంద్రబాబు తెలిపారు.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!
ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!
ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!
డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!
స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!
హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: