ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టింది.. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీని పెంచే పనిలో ఉంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. అమరావతికి ఒక ప్రత్యేకమైన కేబుల్ బ్రిడ్జి ప్లాన్ చేశారు. అమరావతిని విజయవాడ - హైదరాబాద్ నేషనల్ హైవేను కలిపేలా అడుగులు ముందుకుపడుతున్నాయి. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే వారికి ఒక స్వాగత ద్వారంలా ఉంటుందని భావిస్తున్నారు. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు దూరం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడింది.. ఏడీసీఎల్ సంస్థ సర్వే చేసి.. సలహా సంస్థను ఎంపిక చేసే పనిలో ఉంది.
ఈ కేబుల్ బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయిలో మట్టి పరీక్షలు చేస్తున్నారు. ఏడీసీఎల్ సంస్థ సలహాదారుని ఎంపిక కోసం బిడ్లను ఆహ్వానించింది. ఇప్పుడు సాంకేతిక బిడ్ల మదింపు జరుగుతోంది. ఆ తరువాత ఫైనాన్షియల్ బిడ్లను పరిశీలీంచిన తర్వాత కన్సల్టెంట్‌ను ఎంపిక చేస్తారు. ఈ బ్రిడ్జి పూర్తయితే తెలంగాణ నుంచి అమరావతికి వచ్చే వారికి సరికొత్త అనుభూతిలా ఉంటుంది అంటున్నారు. అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణా నదికి అవతల నేషనల్ హైవేపైఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.2 కిలోమీటర్ల పొడవునా కేబుల్ బ్రిడ్జి ప్లాన్ చేశారు. గతంలో 2019లో అప్పటి ప్రభుత్వం ఈ బ్రిడ్జి కోసం నికి శంకుస్థాపనకూడా చేసింది.. రూ. 1,387 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఎన్10 నుంచి పవిత్ర సంగమం వరకు నిర్మించాలని భావించారు.
2019లో ప్రభుత్వం మారడంతో ఈ బ్రిడ్జి ఆగిపోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం తాజాగా పాత ప్రతిపాదనను మార్చి కొత్తగా ప్రతిపాదనలు చేశారు.. పశ్చిమ బైపాస్ రావడంతో ఈ మార్పులు చేశారు. అమరావతిలో ప్లాన్ ప్రకారం.. రాజధానిలోని ముఖ్యమైన రోడ్లు ఎన్6, ఎన్13 లను హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేలకు లింక్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఎన్6 రోడ్డు అనుసంధానం ముగింపు దశకు రాగా.. ఈ రోడ్డుపై ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టిన పశ్చిమ బైపాస్ ఆరు లైన్ల పనులు పూర్తికావొచ్చాయి. దీనికి అదనంగా ఎన్13 రోడ్డును ఎన్‌హెచ్65తో లింక్ చేస్తారు.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి.. ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు..!
ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..
బెయిల్.. అయినా తప్పదు జైలు అన్నట్టుగా వల్లభనేని వంశీ పరిస్థితి! కీలక ఆదేశాలు జారీ.!
చిక్కుల్లో కమల్ హాసన్.. బెంగళూరులో కేసు నమోదు! ఆయన వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం..
ఈ సంప్రదాయం కళాకారులకు గొప్ప.. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి!
కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!
ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: