పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలుకు కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు లభించాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఆంధ్రప్రదేశ్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం పట్ల తెలుగుదేశం పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ వంటి కీలక అంశాలను పర్యవేక్షించే ఎఫ్‌సీఐ కమిటీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వం వహించనున్నారు. ఈ హోదాలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించనున్నారు.
ఇది కూడా చదవండి: తల్లికి వందనంపై బిగ్ అప్డేట్! ఇలా చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు!
ముఖ్యంగా, ధాన్యం సేకరణ ప్రక్రియ, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఇతర పంటల ఉత్పత్తుల సేకరణ, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాల అమలు తీరు వంటి అనేక అంశాలపై ఆయన లోతైన అధ్యయనం చేయనున్నారు. తద్వారా రాష్ట్రంలో ఆహార భద్రతకు సంబంధించిన విషయాల్లో కేంద్రానికి తగిన సూచనలు, సిఫార్సులు అందించే అవకాశం ఆయనకు లభించింది.
తనకు ఈ నూతన బాధ్యతలు అప్పగించడం పట్ల ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంతోషం వ్యక్తం చేశారు. తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక పదవిని ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర రైతుల సంక్షేమానికి, ఆహార ధాన్యాల సేకరణలో పారదర్శకతకు తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: