ఆంధ్రప్రదేశ్‌లో దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి దశాబ్దాల చరిత్ర ఉంది. అయితే నాలుగున్నరేళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రేషన్ షాపులను రద్దు చేసి వాటి స్థానంలో రేషన్ వాహనాలను ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 9 వేలకు పైగా వాహనాలను వినియోగంలోకి తీసుకువచ్చి ఇంటింటికీ రేషన్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ విధానం సమర్థవంతంగా అమలవకపోవడంతో వాహనాలను రోడ్డు పక్కన ఆపి ప్రజలను అక్కడే క్యూల్లో నిలబెట్టే పరిస్థితి వచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ వాహనాల వ్యవస్థను రద్దు చేసి, మళ్లీ రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈరోజు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇప్పటి నుంచి నెల 15వ తేదీ వరకు రేషన్ సరుకులు కేవలం రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో రేషన్ అందుకునేలా ఏర్పాట్లు చేయగా, లబ్ధిదారులకు సమాచారం అందించేందుకు డీలర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురంలో రేషన్ షాపును పునఃప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 29,761 రేషన్ షాపుల ద్వారా 1.46 కోట్ల కుటుంబాలకు సరుకులు పంపిణీ అవుతున్నాయని మంత్రి తెలిపారు. అంతేకాదు, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటుతో పాటు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే రేషన్ అందజేస్తామని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి సుమారు రూ.385 కోట్ల ఆదా జరుగుతుందని ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!
ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!
ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: