ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లోనే పాఠశాలలు ఓపెన్ కానున్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడిగా ఉన్న పథకాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అని పేరు మార్చింది. అయితే ఈ తల్లికి వందనం పథకాన్ని జూన్ నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఒక ఇంట్లో ఎంత మంది చదువుకునే విద్యార్థులు ఉంటే వారికి ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున వారి తల్లుల అకౌంట్లలో నగదు జమ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు చేయనుంది అనేదానిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటన చేశారు.
తాజాగా పెన్షన్ల పంపిణీ భాగంగా తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటలోని నక్కపల్లి మండలంలోని ఉద్ధండపురం గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లు రీ ఓపెన్ అయ్యేలోపు అంటే జూన్ 15వ తేదీ లోపు తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని మరోసారి తేల్చి చెప్పారు. లబ్ధిదారులైన పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున వారందరికీ డబ్బులు జమ చేయనున్నట్లు వంగలపూడి అనిత వెల్లడించారు.
ఇక ఇటీవలె టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ పథకాలపై చర్చించారు. కూటమి సర్కార్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం.. గత ఏడాది కాలంలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇటీవల కడపలో నిర్వహించిన మహానాడు వేదికగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశాం, రానున్న రోజుల్లో ఇంకా ఏం చేస్తాం అనేది వివరించినట్లు తెలిపారు. నేతలంతా ప్రజలతో మరింత మమేకం అయి.. ప్రభుత్వ కార్యక్రమాలపై వారితో చర్చిస్తూ పర్యవేక్షించాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!
ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!
ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!
డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!
స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!
హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: