గతవారం వరుసగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గి వినియోగదారులకు ఊరట ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు స్థిరపడటం, డాలర్ విలువలో స్వల్ప మార్పులు రావడం వల్ల ఈ తగ్గుదల చోటు చేసుకుంది.
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.760 తగ్గి ప్రస్తుతం రూ.1,02,280గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పడిపోయి రూ.93,750కు చేరింది. బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.
ఇక వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,27,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు నమోదవుతున్నాయి.
బంగారం ధరలు తగ్గడంతో వివాహాలు, శుభకార్యాలు ముందున్న కుటుంబాలు కొనుగోళ్లపై దృష్టి సారించే అవకాశముంది. అయితే మార్కెట్ నిపుణులు ధరలు మళ్లీ ఎప్పుడు పెరుగుతాయో చెప్పడం కష్టమని, కాబట్టి అవసరమైతే త్వరగా కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.